టాలీవుడ్లో మరో ఆసక్తికర కాంబినేషన్ కు తెరలేంచింది. ప్రస్తుత తరంలో అత్యుత్తమ నటుల్లో ఒకడైన జూనియర్ ఎన్టీఆర్.. అత్యుత్తమ దర్శకుల్లో ఒకడైన త్రివిక్రమ్ కలిసి ఓ సినిమాకు శ్రీకారం చుట్టేశారు. రెండు రోజుల కిందటే వీరి కలయికలో సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ ఆసక్తికర కలయికలో రాబోయే సినిమా ఎలా ఉంటుందో అన్న చర్చ ఇప్పటికే మొదలైంది. ఎన్టీఆర్ దారిలోకి త్రివిక్రమ్ వస్తాడా.. లేక త్రివిక్రమ్ దారిలోకి ఎన్టీఆర్ వస్తాడా అంటూ ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. ఐతే ఈ ఇద్దరూ ఒకరి నుంచి ఒకరు ఏం ఆశిస్తున్నారో పరస్పరం ఆలోచనలు పంచుకుని.. అందుకు తగ్గ కథతోనే ముందుకెళ్తున్నట్లు సమాచారం.
జూనియర్ ఎన్టీఆర్ మొదట్నుంచి ఎక్కువగా మాస్ మసాలా కథలతోనే ముందుకు సాగాడు. ఈ క్రమంలో క్లాస్ ప్రేక్షకుల్లో అతడికి పెద్దగా పట్టు దొరకలేదు. ఐతే ‘టెంపర్’.. ‘నాన్నకు ప్రేమతో’ లాంటి వైవిధ్యమైన సినిమాలతో క్లాస్ లో ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ‘జనతా గ్యారేజ్’తో కొంతమేర ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా చేరువయ్యాడు. మళ్లీ ఇటీవలే ‘జై లవకుశ’తో మళ్లీ మాస్ మంత్రం పఠించాడు. ఐతే ‘జనతా గ్యారేజ్’తో ఫ్యామిలీ ఆడియన్స్ లో ఏర్పడ్డ బేస్ ను త్రివిక్రమ్ సినిమాతో మరింత బలపరుచుకోవాలని చూస్తున్నాడు ఎన్టీఆర్. ఫ్యామిలీ ఎమోషన్ల నేపథ్యంలో సాగే మంచి లవ్ స్టోరీ చేయాలని ఎన్టీఆర్ త్రివిక్రమ్ కు చెప్పాడట. బేసిగ్గా త్రివిక్రమ్ శైలే అదే కాబట్టి.. కొంచెం తారక్ మాస్ ఇమేజ్ ను కూడా దృష్టిలో ఉంచుకుని.. ఫ్యామిలీ ట్రీట్మెంట్ తో ఈ సినిమాను తీర్చిదిద్దబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా వీళ్లిద్దరికీ ఉభయతారకంగా ఉంటుందని అంటున్నారు.