అనేక నాటకీయ మలుపులు తిరిగిన 'కత్తి' రీమేక్ వ్యవహారం చివరికి ఓ రసవత్తర మలుపు దగ్గర ఆగింది. గత ఏడాది తమిళంలో సెన్సేషనల్ హిట్టయిన ఈ సినిమా తెలుగులోకి రీమేక్ అవబోతుండటం ఇక ఎంత మాత్రం రూమర్ కాదు. అన్ని ఊహాగానాలకు తెరదించుతూ ఈ రీమేక్ విషయంలో ఓ క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. ముందుగా అనుకున్నట్లే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించబోతున్నాడు. డాన్ శీను, బలుపు లాంటి హిట్ సినిమాలు తీసి.. ప్రస్తుతం పండగ చేస్కో పనుల్లో బిజీగా ఉన్న యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు.
గోపీచంద్ ఇంతకుముందు 'బాడీగార్డ్' సినిమాను రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌కు సన్నిహితుడైన నల్లమలుపు శ్రీనివాస్, రీమేక్‌లు తీయడంలో స్పెషలిస్టు అయిన ఠాగూర్ మధు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఇక ఈ ప్రాజెక్టు గురించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావడమే తరువాయి. కత్తి సినిమాను మొదట డబ్ చేసి విడుదల చేయాలనుకున్నారు. విడుదలకు ముందు అందుకు సన్నాహాలు కూడా జరిగాయి. ఐతే 'కత్తి' విడుదలయ్యాక సూపర్ హిట్ టాక్ రావడంతో దాన్ని రీమేక్ చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. మొదట పవన్ కళ్యాణ్‌తో చేయాలనుకున్నారు. కానీ ఆయన ఒప్పుకోలేదు. తర్వాత ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది. డబ్బింగ్ సినిమా కూడా ఎంతకీ రాకపోవడంతో 'కత్తి' రీమేక్ ఖాయమన్న వార్తలు ఈ మధ్య మళ్లీ వినిపించాయి. ఇంతలోనే ఈ ప్రాజెక్టు గురించి ఓ క్లారిటీ వచ్చేసింది.