మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి కలిసి నటించిన చిత్రం 'ట్రిపుల్ ఆర్'. దర్శకధీరుడు రాజమౌళి అత్యతం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం మార్చిలో విడుదలై దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. చరిత్రలో నిలిచిపోయిన ఇద్దరు ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు, కొమురం భీంల ఫిక్షనల్ స్టోరీగా తెరకెక్కించిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రికార్డుల మోత మోగించింది. వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద రూ.1100 కోట్ల మేర వసూళ్లని రాబట్టి మరోసారి తెలుగు సినిమా సత్తాని యావత్ ప్రపంచానికి చాటింది.
అంతే కాకుండా ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ నటనకు పెద్ద ఎత్తున ప్రశంసలు దక్కాయి. విదేశీయులు సైతం ఈ చిత్రానికి సోషల్ మీడియా ప్రచార కర్తలుగా మారి సినిమాని ప్రమోట్ చేయడం విశేషం. యుఎస్ లో పలువురు విదేశీ ప్రేక్షకులు ఈ సినిమాపై తమ ప్రేమని కురిపించి ప్రతీ ఒక్కరూ ఈ సినిమా చూడమంటూ ప్రచారం చేస్తూ ఆశ్చర్యపరిచారు కూడా. మునుపెన్నడూ లేనంతగా తెలుగు సినిమాకు విదేశీ గడ్డపై విదేశీయుల ఆదరణ లభించడంతో చిత్ర బృందం ఆనందాన్ని వ్యక్తం చేసింది.
దేశ వ్యాప్తంగా కూడా ఈ సినిమాపై వివిధ భాషల ప్రేక్షకులు కూడా తమ అభిమానాన్ని చాటుకున్నారు. దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు దక్కాయి. ఉత్తరాదిలో ప్రేక్షకుల్ని ఈ చిత్రం మరింతగా ఆకట్టుకుని వసూళ్ల వర్షం కురిపించింది.
ఇదిలా వుంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన అంశం ఇటీవల ఓ పరీక్షా పత్రంలో చోటు చేసుకోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఓ ప్రశ్నా పత్రంలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ ప్రశ్నిని వేశారు. ఇది ఇప్పడు నెట్టింట వైరల్ గా మారింది.
ట్రిపుల్ ఆర్ లో ఎన్టీఆర్ గోండు బెబ్బులి కొమురం భీం పాత్రలో నటించిన విషయం తెలిసిందే. 'ట్రిపుల్ ఆర్ లో కొమురం భీం పాత్రలో ఆకట్టుకున్న ఎన్టీఆర్ తో మీరు ఓ రిపోర్టర్ గా ప్రశ్నలు అడుగుతూ ఇంటర్వ్యూ చేస్తూ ఓ వ్యాసం వ్రాయండి' అంటూ ఓ పరీక్షకు సంబంధించిన ప్రశ్నా పత్రంలో క్వశ్చన్ ని వేశారు. దీనికి సంబంధించిన ప్రశ్నా పత్రం ఇప్పడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ ప్రశ్నా పత్రాన్ని సోసల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేస్తున్నారు.
ఎన్టీఆర్ ప్రస్తుతం తన 30వ చిత్రం కోసం రెడీ అవుతున్న విషయం తెలిసిందే. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్ నిర్మించబోతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ అయిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి ప్రారంభం కాబోతోంది.