బాలయ్య-ఎన్టీఆర్.. సయోధ్య కుదిరినట్లే

Update: 2016-12-17 17:30 GMT
బాబాయ్-అబ్బాయ్ లు అయిన నందమూరి బాలకృష్ణ.. జూనియర్ ఎన్టీఆర్ మధ్య కోల్డ్ వార్. టాలీవుడ్ లో ఇది ఎప్పుడూ హాట్ టాపిక్కే. 2016 సంక్రాంతికి అయితే.. ఇది పీక్ స్టేజ్ కి చేరిపోయిందనే టాక్ కూడా ఉంది. బాలయ్య నటించిన డిక్టేటర్.. ఎన్టీఆర్ మూవీ నాన్నకు ప్రేమతో చిత్రాలు ఒక్క రోజు గ్యాప్ లో విడుదలయ్యాయి. నందమూరి హీరోల మధ్య సయోధ్య కుదరకే.. ఇలా పోటాపోటీగా రిలీజ్ చేశారనే టాక్ ఉంది.

అప్పటి నుంచి బాలయ్య గురించి ఎన్టీఆర్ కానీ.. జూనియర్ గురించి బాలయ్య గానీ ఎక్కడా నోరు మెదపలేదు. జనతా గ్యారేజ్ ఆడియో ఫంక్షన్ లో అయితే.. బాలకృష్ణ పేరు చెప్పకుండానే (ఒక్క సాయికుమార్ తప్ప) వేడుకను పూర్తి చేశారు. దీంతో వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందనే మాటలకు మరింత  బలం వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితిలో ఛేంజ్ వచ్చినట్లుగా కనిపిస్తోంది. బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్ రిలీజ్ అయిన గంటల వ్యవధిలోనే.. 'బాబాయ్ తన బెస్ట్ అందించారు. NBKను కొత్తగా చూపించిన దర్శకుడు క్రిష్‌ కు అభినందనలు' అంటూ ట్వీట్ చేశాడు ఎన్టీఆర్.

ఒకవేళ వారిద్దరి మధ్య ఇంకా వివాదం రగులుతుంటే.. ఎన్టీఆర్ నుంచి ఈ ట్వీట్ పడేది కాదు. అది కూడా ఇంత స్పీడ్ గా. కానీ శాతకర్ణి ట్రైలర్ కి ఎన్టీఆర్ నుంచి వచ్చిన రియాక్షన్ చూస్తే.. బాబాయ్ తో వివాదాలకు(ఉంటే) చెక్ చెప్పేసినట్లే అనుకోవాలి. ఇదే నిజమైతే మాత్రం.. అందరికంటే ఎక్కువ హ్యాపీగా ఫీలయ్యేది నందమూరి అభిమానులే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News