ఒక్కో అబ్బాయ్‌ ఒక్కొక్కరిని ఎత్తుకెళ్లారు

Update: 2015-07-15 17:07 GMT
బాలయ్య లెజెండ్‌ ఎందరికో కొత్త జీవితాన్ని ప్రసాదించింది. అప్పటివరకూ హీరోగా కొనసాగుతున్నా.. అవకాశాల్లేక గోళ్లు గిల్లుకునే పరిస్థితిలో ఉన్నాడు జగపతిబాబు. ఉన్నట్టుండి లెజెండ్‌తో విలన్‌ అయ్యాడు. ఆ సినిమాలో జగ్గూ భాయ్‌ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలొచ్చాయి. వాటితో పాటే పది సినిమాల్లో విలనీ చేసే అవకాశాలు కూడా దక్కాయి.

అలాగే అదే సినిమాతో గ్లామరస్‌ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది సోనాల్‌ చౌహాన్‌. అప్పటివరకూ ఈ అమ్మడి పేరు కూడా ఊహించలేని మన తెలుగు ప్రేక్షకులకు సోనాల్‌ బాగా క్లోజ్‌ అయిపోయింది. బాలయ్యతోనే రెండు సినిమాల్లో నటించేసింది. రామ్‌తో సినిమా చేసింది. ఇప్పుడు ఏకంగా నాలుగైదు ప్రాజెక్టుల్లో నాయిక.

ఇకపోతే ఇప్పుడు వీళ్లిద్దరి గురించి ఈ దండకం ఎందుకంటే.. బాబాయ్‌ రూటునే అబ్బాయిలు ఫాలో అవుతున్నారు కాబట్టి. ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌ల సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నారు. జగపతిబాబు ఎన్టీఆర్‌ హీరోగా సుకుమార్‌ తెరకెక్కిస్తున్న మానాన్నకు ప్రేమతో చిత్రంలో మాఫియా డాన్‌ పాత్రలో నటిస్తున్నాడు. అలాగే సోనాల్‌ కళ్యాణ్‌రామ్‌ 'షేర్‌'లో అందాలు చిందించే పాత్రలో నటిస్తోంది. బాలయ్య సినిమాతో ఫామ్‌లోకి వచ్చిన ఈ ఇద్దరూ నందమూరి నట వారసులకు కూడా హిట్లిస్తారేమో చూడాలి.
Tags:    

Similar News