యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తారక్ కెరీర్ లో వస్తున్న ఈ 30వ చిత్రం ఎన్టీఆర్ ఆర్ట్స్ - యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై నిర్మించబడుతోంది. గతంలో వీరి కాంబోలో వచ్చిన 'జనతా గ్యారేజ్' సినిమా సూపర్ హిట్ అవడంతో '#NTR30' ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా నేపథ్యం గురించి సినీ2వర్గాల్లో ఆసక్తికరమైన డిస్కషన్ జరుగుతోంది.
ఎన్టీఆర్ తో కొరటాల శివ రెండోసారి రూపొందిస్తున్న ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో ఉంటుందని టాక్ నడుస్తోంది. ఇంతకముందు మహేష్ బాబుతో కొరటాల తీసిన 'భరత్ అను నేను' సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. ఈ క్రమంలో తారక్ తో కూడా అలాంటి సినిమానే ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రజా సమస్యలపై పోరాడి ఒక సామాన్యుడు ఒక నాయకుడిగా ఎలా మారాడు.. రాజకీయాల్లో వచ్చి ఎలా ఎదిగాడనే పాయింట్ తో ఈ సినిమా కథ రాసుకున్నారని అంటున్నారు.
రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన ఎన్టీఆర్.. ఇంతవరకు పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయలేదు. ఇంక తారక్ రాజకీయాల్లో రావాలని అభిమానులు గట్టిగా పట్టుబడుతున్న సమయంలో అలాంటి నేపథ్యంలో సినిమా చేయడం కరెక్ట్ స్టెప్ అని భావిస్తున్నారు. 'ఆర్.ఆర్ ఆర్' సినిమాతో ఎన్టీఆర్ దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంటాడు కాబట్టి.. '#NTR30' చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రూపొందించనున్నారు. రాజకీయాల గురించి సమయం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం అని మీడియా ముఖంగా చెప్పిన జూ.ఎన్టీఆర్.. తన సినిమాతో పొలిటికల్ ఎంట్రీ గురించి హింట్ ఇస్తాడేమో చూడాలి.