ఎన్టీఆర్ బర్త్ డే నాడు '#NTR31' ప్రకటన..?

Update: 2021-04-17 08:30 GMT
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్.ఆర్ ఆర్' సినిమాలో నటిస్తున్నాడు. ఈ పాన్ ఇండియా సినిమా తర్వాత తారక్ మార్కెట్ నెక్స్ట్ లెవల్ కి చేరుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఎన్టీఆర్ ఇకపై అన్నీ పాన్ ఇండియా రేంజ్ సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో 'NTR30' సినిమా అనౌన్స్ చేసాడు తారక్. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ నిర్మించనున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపొందనుంది. ఈ క్రమంలో తాజాగా ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం '#NTR31' ప్రాజెక్ట్ కూడా ఖరారైనట్లు తెలుస్తోంది.

'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్  31వ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందనుంది. ఇది కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడం గమనార్హం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. నిజానికి తారక్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ భారీ ప్రాజెక్ట్ ఉంటుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. గతేడాది ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ప్రశాంత్ నీల్ - మైత్రీ టీమ్ వేసిన ట్వీట్స్ తో వీరి కలయికలో సినిమా చేయనున్నట్లు అర్థం అయింది. అయితే ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో 'సలార్' మూవీకి కమిట్ అవడంతో.. తారక్ తో సినిమా ఎప్పుడా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో మే 20న '#NTR31' పై క్లారిటీ ఇవ్వనున్నారని తెలుస్తోంది.
Tags:    

Similar News