యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో నటిస్తున్నాడు. కోవిడ్ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. దీని తర్వాత కొరటాల శివతో 'NTR30' సినిమాని చేయనున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ - యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమా రూపొందనుంది. ఇక దీని తరువాత ఎన్టీఆర్ చేయబోయే ప్రాజెక్ట్ పై ఈ మధ్య అనేక వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో '#NTR31' సినిమాపై ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చేశారు.
కరోనా సోకడంతో ప్రస్తుతం కుటుంబంతో కలిసి హోమ్ క్వారంటైన్ లో ఉన్న ఎన్టీఆర్.. లేటెస్టుగా ఓ ఇంగ్లీష్ డైలీతో ఫోన్ లో మాట్లాడారు. 'ఆర్.ఆర్.ఆర్' సినిమాతో కొరటాల శివ సినిమా ఉంటుందని.. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని తారక్ చెప్పారు. దీని తర్వాత 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమా చేయనున్నట్లు ఎన్టీఆర్ వెల్లడించారు. దీంతో ఇన్నాళ్లుగా సస్పెన్స్ గా ఉన్న '#NTR31' పై స్పష్టత వచ్చిందని. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందే అవకాశం ఉంది.
ఇంకా 'ఆర్.ఆర్.ఆర్' సినిమా గురించి మాట్లాడిన ఎన్టీఆర్.. ఇందులో కొమురం భీమ్ పాత్ర కోసం 18 నెలలు ట్రైనింగ్ తీసుకున్నట్లు చెప్పారు. సుమారు 19 నెలల పాటు RRR షూటింగ్ చేశామని.. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు వావ్ అనేలా ఉంటాయని తారక్ వెల్లడించారు. పాండమిక్ వల్ల బడ్జెట్ లో స్క్రిప్ట్ లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదని.. ఇప్పటికీ సినిమా అక్టోబర్ వచ్చే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.