ఇక కలెక్షన్ల లెక్కలతో కొడతారన్నమాట

Update: 2015-04-10 09:30 GMT
సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వచ్చిందనుకోండి కలెక్షన్ల లెక్కల్ని మీడియా వాళ్లే శోధించి సాధించి.. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ ఇచ్చేస్తుంటారు. కానీ ఓ సినిమా నెగెటివ్‌ టాక్‌తో మొదలైందంటే మాత్రం మూవీ మేకర్సే రంగంలోకి దిగిపోతారు. ఈ రోజుల్లో టాక్‌ చాలా ఈజీగా స్ప్రెడ్‌ అయిపోతుంది. ప్రేక్షకులు వేగంగా ఓ అభిప్రాయానికి వచ్చేస్తారు. కాబట్టి నిర్మాత అప్రమత్తమైపోవాల్సిందే. లేదంటే తేడా వచ్చేస్తుంది. సన్నాఫ్‌ సత్యమూర్తి విషయంలో జరుగుతోంది ఇదే. సినిమా మీద భారీ అంచనాలున్నాయి కాబట్టి.. వీకెండ్‌ మొత్తానికి బుకింగ్స్‌ ముందే అయిపోయాయి.

రిలీజ్‌ కూడా భారీగా చేశారు కాబట్టి కలెక్షన్లకు తిరుగుండదు. బన్నీ కెరీర్లో బెస్ట్‌ వీకెండ్‌ కలెక్షన్స్‌ సాధించడం లాంఛనమే అని చెప్పాలి. ఇప్పటికే ఫస్ట్‌ డే కలెక్షన్ల విషయంలో బన్నీ రికార్డు కొట్టేసినట్లే అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో కలిపి 'సన్నాఫ్‌ సత్యమూర్తి' రూ.9 కోట్ల గ్రాస్‌ వసూలు చేసిందని అంచనా. షేర్‌ రూ.7 కోట్ల దాకా ఉండొచ్చు. 'రేసుగుర్రం' తొలి రోజు రూ.8 కోట్ల గ్రాస్‌, రూ.6.5 కోట్ల షేర్‌ వసూలు చేసింది. యుఎస్‌లో ఆగడు, అత్తారింటికి దారేది తర్వాత ప్రిమియర్‌ షోల ద్వారా ఎక్కువ వసూలు చేసిన రికార్డు 'సన్నాఫ్‌ సత్యమూర్తి'దే. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.13 కోట్లకు పైనే గ్రాస్‌ వసూళ్లు ఉండొచ్చని తెలుస్తోంది. వీకెండ్‌లో పాతిక కోట్ల గ్రాస్‌ వచ్చినా రావచ్చు. ఈ కలెక్షన్ల లెక్కలు చూపించి.. 'సన్నాఫ్‌ సత్యమూర్తి' బ్లాక్‌బస్టర్‌ అని ప్రచారం చేస్తారేమో. కానీ దాంతో పాటే సోమవారం కలెక్షన్ల లెక్కలు కూడా తీస్తే.. అప్పుడు తెలుస్తుంది సినిమా అసలు సత్తా ఏంటో?

Tags:    

Similar News