ఎఫ్2లో రివర్స్ కొట్టిన బిగ్ బాస్

Update: 2019-01-13 07:00 GMT
నిన్న విడుదలైన ఎఫ్2 పాజిటివ్ టాక్ తో వసూళ్ళ పరంగా బాగానే వర్క్ అవుట్ అవుతున్నప్పటికీ దీనికి విమర్శల పర్వం తప్పలేదు. దర్శకుడు అనిల్ రావిపూడి ఫస్ట్ హాఫ్ లో చూపించిన ఫన్ ని సెకండ్ హాఫ్ లో నిజమైన ఫ్రస్ట్రేషన్ గా మార్చాడనే కామెంట్ బలంగా వినిపిస్తుండగా చాలా అంశాల్లో చేసిన నిర్లక్ష్యం పూర్తి ఫలితాన్ని ఇవ్వకుండా అడ్డుకుంది. ఇక ఇందులో గూడ్స్ ట్రైన్ అంత తారాగణాన్ని తీసుకున్న అనిల్ వెరైటీ కోసం బిగ్ బాస్ పార్టిసిపెంట్ నూతన్ నాయుడుని కూడా తీసుకొచ్చాడు.

వైల్డ్ కార్డు ఎంట్రీ పేరుతో ఒకే సీజన్ రెండు సార్లు వచ్చి ఎలిమినేట్ అయిన నూతన్ నాయుడు టీవీ ప్రేక్షకులకు సుపరిచితుడే. అందుకే ఆ రకంగా కనెక్ట్ అవుతారని భావించాడు కాబోలు వెన్నెల కిషోర్ కు అసిస్టెంట్ గా ఓ పాత్రను సృష్టించాడు. అయితే ఈ ట్రాక్ మొత్తం ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోగా అసలు అవసరమా అనే ఫీలింగ్ కూడా కలిగించింది. కారణం లేకపోలేదు. నూతన్ నాయుడుకి పెద్దగా డైలాగ్స్ లేవు. ఉన్న కొన్ని కూడా ఏదో పుస్తకంలో బట్టిపట్టి అప్పజెప్పినట్టు చేసాడు తప్ప యాక్టింగ్ లో బేసిక్స్ కూడా లేకుండా మొక్కుబడిగా కానిచ్చేసాడు. ఇతని దాకా అవసరం లేదు.

అసలు వెన్నెల కిషోర్ ఎపిసోడే నీరసంగా ఉంది. సన్నివేశాల్లో బలం లేకపోవడంతో ఒకటి రెండు మాటలు తప్ప వెన్నెల కిషోర్ సైతం నీరసంగా చేసుకుంటూ పోయాడు. ప్రీ క్లైమాక్స్ ముందు వచ్చే కీలకమైన భాగాన్ని ఇలా వీళ్ళిద్దరితో బోరింగ్ గా మార్చడంతో ఫైనల్ గా తేడా కొట్టించింది. వెంకీ టైమింగ్ కాపాడింది కాని లేదంటే ఎఫ్2 గోవిందా జాబితాలో చేరిపోయేదే.


Full View

Tags:    

Similar News