బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ‘తాండవ్’. జనవరి 15న ఓటీటీలో మొదటి పార్ట్ రిలీజైంది. అయితే.. ఇందులో హిందువుల మనోభావాలను దెబ్బతీసి సీన్లు ఉన్నాయని, ఈ సినిమాను వెంటనే బ్యాన్ చేయాలని బీజేపీ ఎంపీ మనోజ్ కోటక్ డిమాండ్ చేశారు. తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ సమాచార- ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్‌కు లేఖ రాశారు.
ఓటీటీలకున్న విచ్చలవిడి స్వేచ్ఛ ఇవ్వడం వల్ల హిందువుల మనోభావాలపై పదేపదే దాడి జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నుంచి ఓటీటీ ద్వారా వచ్చే సినిమాల మీద కూడా నియంత్రణ ఉండాలని కోరారు.
హిందువుల మనోభావాలను కించపరిచినందుకుగానూ తాండవ్ చిత్రయూనిట్ క్షమాపణలు చెప్పాలని ఎంపీ డిమాండ్ చేశారు. కాగా.. సోషల్ మీడియాలోనూ ‘తాండవ్’ సిరీస్ మీద పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తమ దేవుళ్లను ఎగతాళి చేశారని మండిపడుతున్నారు. ముఖ్యంగా నటుడు మహ్మద్ జీషా అయ్యుబ్ స్టేజీ మీద శివుడిగా కనిపించే సీన్‌ను వెంటనే తొలగించాలని పట్టుపడుతున్నారు.
అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ డ్రామాను అలీ అబ్బాస్‌తో కలిసి హిమాన్షు కిశన్ మెహ్రా నిర్మించారు. డింపుల్ కపాడియా, సునీల్ గ్రోవర్, తిగ్మన్షు ధులియా, గౌహర్ ఖాన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.