టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి 'కరాటే కల్యాణి'. సినిమాల్లో వ్యాంప్ పాత్రలతో ఫేమస్ అయిన ఈమె.. పలు సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. అయితే.. తనకు ఒడిశా ఎంపీ వరుసగా ఫోన్లు చేశాడంటూ సోషల్ మీడియాలో వెల్లడించడం సంచలనం రేకెత్తించింది.
''ఈ రోజు నాకు కాల్ వచ్చింది. ఎవరో ఒరిస్సా ఎంపీ అంట. నాకు కాల్ చేసి మీరు చేసిన సేవ బావుంది. నేను మూడుసార్లు ఎంపీని మా ఒరిస్సా నుండి మీకు ఏదైనా సాయం కావాలా?'' అని అడిగాడట. దాదాపు పదిసార్లు ఇలా ఫోన్ చేశాడట. అయితే.. చివరకు మీకు పెళ్లైందా అని అడగడంతో అసలు విషయం తనకు అర్థమైందని, తన స్టైల్లో కౌంటర్ ఇచ్చినట్టు ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది.
''కోట్లు ఇస్తాడట. నేనే దొరికానా రా? గొంతు మార్చి ఒక్కడే మాట్లాడుతున్నాడు. నా దగ్గర నీ పప్పులు ఉడకవు. నేను చెప్పాను చాలా మంది ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్లకు సేవ చేయమని'' అంటూ రాసుకొచ్చింది కల్యాణి. అంతేకాదు.. తన నంబర్ కోసం విజయశాంతిని, డీకే అరుణను కూడా అడిగానని చెప్పాడట సదరు వ్యక్తి.
బీజేపీలో మీకు ఏదో పదవి ఉందని అనుకున్నాను అంటూ మాట కలిపి.. ఏదేదో మాట్లాడుతూ వచ్చాడట. సోషల్ మీడియాలో ఇలాంటివాళ్లు చాలా మందే ఉన్నారని, ఎవరినీ నమ్మొద్దని సూచించింది కల్యాణి. ఇలాంటి వాళ్లు అడుగడుగునా పొంచి ఉంటారని, తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించింది.