ఒక పెద్ద సినిమాకు పూర్తి నెగెటివ్ టాక్ వస్తే రెండో రోజు నుంచే వసూళ్లు పడిపోవడం థియేటర్లు వెలవెలబోడం.. నామమాత్రంగా షేర్ రావడం గతంలో చాలాసార్లు చూశాం. కానీ వసూళ్లు ఎంత పడ్డా కూడా షేర్ ఎంతో కొంత రావాలి. కానీ థియేటర్ల రెంట్.. ఇతర మెయింటైనెన్స్ ఖర్చులు కూడా రాకపోవడం అన్నది మాత్రం గతంలో ఎన్నడూ జరిగి ఉండదు. ముక్కూ ముఖం తెలియనివాళ్ల సినిమాలకు అలాంటి పరిస్థితి ఎదురవుతుందేమో కానీ.. ఒక బడా స్టార్ సినిమాకు ఇలా జరగడం మాత్రం నభూతో అనే చెప్పాలి. అక్కినేని నాగార్జున స్థాయి కథానాయకుడికి ఇలా జరుగుతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఆయన నటించిన ‘ఆఫీసర్’కు ఈ అవమానమే ఎదురైంది. ఫలానా ఏరియా అని కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్లా ఇదే పరిస్థితి.
రెండో రోజు అసలు డిస్ట్రిబ్యూటర్ కు షేర్ అన్నదే రాలేదు. వచ్చినవి థియేటర్ల మెయింటైనెన్స్ కే సరిపోలేదు. మొత్తంగా తెలంగాణ అంతటా కలిపితే రూ.11 లక్షల వసూళ్లు వచ్చాయంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ‘ఆఫీసర్’ను నడిపించడం వల్ల చేతి నుంచి ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి రావడంతో డిస్ట్రిబ్యూటర్లు..ఎగ్జిబిటర్లు స్వచ్ఛందంగా థియేటర్ల నుంచి తీసేస్తున్న పరిస్థితి. ముందు చేసుకున్న ఒప్పందాలన్నీ బుట్టదాఖలు అయిపోతున్నాయి. వాటిని మన్నించే పరిస్థితి లేదు. ఈ విషయంలో ఎవ్వరూ అభ్యంతర పెట్టే పరిస్థితి కూడా కనిపించడం లేదు. థియేటర్లన్నీ వెలవెలబోతుండటంతో ఎవ్వరైనా ఏం చేస్తారు. చాలాచోట్ల ‘ఆఫీసర్’ను తీసేసి దీనికి పోటీగా వచ్చి మంచి టాక్ తెచ్చుకున్న విశాల్ మూవీ ‘అభిమన్యుడు’ను రీప్లేస్ చేసేస్తున్నారు.