కొద్ది రోజుల క్రితం వెలుగు చూసిన ఉదంతం వైరల్ గా మారటం తెలిసిందే. షూటింగ్ కోసం విదేశాలకు వెళుతున్న వేళ.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు అనుకోని షాక్ ఎదురుకావటం తెలిసిందే. తాను సల్మాన్ అని.. భాయ్ ఇమేజ్ ఉన్న వేళ.. ఎక్కడికైనా ఇట్టే వెళ్లిపోవచ్చన్న ధీమాకు చెక్ చెప్పారు ఒక భద్రతా అధికారి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారటం తెలిసిందే. సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా షేర్ అవుతున్న ఈ వీడియో కు సంబంధించి ఒక ఫేక్ న్యూస్ చలామణీ అవుతోంది.
‘టైగర్ 3’ మూవీ షూటింగ్ నేపథ్యంలో రష్యా వెళ్లేందుకు దేశ రాజధాని న్యూ ఢిల్లీ ఎయిర్ పోర్టు వద్ద కారు దిగారు. అనంతరం.. లోపలకు వెళ్లిపోయే ప్రయత్నం చేశారు.అయితే.. ఆయన్ను ఒక యువ అధికారి ఒకరు నిలువరించారు. చూపించాలని కోరారు. దీంతో..సదరు అధికారికి అడ్డు చెప్పలేని సల్మాన్.. అతని సిబ్బంది అవసరమైన పేపర్లను చూపించారు. దీంతో ఆయన్ను లోపలకు అనుమతించారు.
దీనికి సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ కావటం తెలిసిందే. అంతేకాదు..సల్మాన్ ను ఆపిన సదరు భద్రతా అధికారిపై చర్యలు తీసుకున్నారంటూ పెద్ద ఎత్తున పోస్టులు సర్య్కులేట్ అవుతున్నాయి. దీంతో సీఐఎస్ఎఫ్ స్వయంగా ఒక ట్వీట్ చేసింది. సోషల్ మీడియాలో ప్రచారం జరిగినట్లుగా సదరు అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. అవన్నీ అవాస్తవాలుగా కొట్టిపారేశారు.
ఆ మాటకు వస్తే.. సల్మాన్ ను నిలిపివేసిన అధికారికి రివార్డు ఇచ్చామని.. విధి నిర్వహణలో సరిగ్గా పని చేసే వారందరికి ఇదో స్ఫూర్తిగా నిలుస్తుందని చెబుతున్నారు. డ్యూటీలో చక్కగా వ్యవహరించినందుకు ఎలాంటి ప్రోత్సహాకాలు తెలిసిన తర్వాత.. మిగిలిన సిబ్బంది సైతం కమిట్ మెంట్ తో పని చేస్తారన్న మాట వినిపిస్తోంది. సెలబ్రిటీ అన్న దానితో సంబంధం లేకుండా.. విధినిర్వహణను పక్కాగా చేసిన వైనం అభినందనీయమని చెప్పక తప్పదు.