సమంత అక్కినేని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం `ఓ బేబి`. నాగశౌర్య కథానాయకుడు. నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ సహా అన్ని పనులు పూర్తయ్యాయి. త్వరలోనే సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇటీవలే రిలీజైన టీజర్ ఆకట్టుకుంది. సమంత ఈ చిత్రంలో 60 ఏళ్ల వృద్ధురాలిగా నటించడం ఓ సర్ ప్రైజ్ అనుకుంటే 60 ప్లస్ భామ్మ గారు 20కి మారితే ఎలా ఉంటుందో తెరపై చూస్తే సర్ ప్రైజ్ అవుతారట. ఓ కొరియన్ మూవీ రీమేక్ ఇది.
తాజాగా ఓ బేబి టైటిల్ సాంగ్ రిలీజైంది. ట్యూన్ రొటీన్ గా ఉన్నా క్యాచీగా ఉండే పదాలతో ఆకట్టుకుంది. లక్ష్మీ భూపాల లిరిక్ ఇవ్వగా.. అనురాగ్ కులకర్ణి కొరియోగ్రఫీ అందించారు. 20 ఏళ్ల అందమైన యువతి షాపింగ్ కి వస్తే అటుపై ఆ షాపులో తనకు నచ్చినట్టు ప్రవర్తిస్తే.. పాపం సేల్స్ బోయ్స్ పడే పాట్లేమిటో పాటలో చూపించారు. లైఫ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేయాలి అన్నట్టే ఆవిడలా ప్రవర్తించడం వెనక ఇంకేదో లాజిక్ ఉందిలే అని మధ్యలో క్లూ ఇవ్వడం ఆసక్తి రేకెత్తిస్తోంది. సామ్ ఫ్రీస్టైల్ డ్యాన్సింగ్ ఎంతో స్పెషల్ గా ఆకట్టుకుంటోంది.
సమంత తప్ప ఆ పాత్రకు ఇంకెవరూ సూట్ కారు! అన్నంతగా ఒదిగిపోయి నటించిందని అర్థమవుతోంది. తన ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ ఈ సినిమాకి ప్లస్ కానుంది. చాలా గ్యాప్ తర్వాత నందిని రెడ్డి తిరిగి ఈ సినిమాతో రీబూట్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. `అలా మొదలైంది` తర్వాత సిద్ధార్థ్ తో `జబర్ధస్త్` ఫ్లాప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు చాలా పట్టుదలగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారనే అర్థమవుతోంది. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. డి.సురేష్ బాబు సమర్పణలో గురు ఫిలింస్- పీపుల్ మీడియా ఫ్యాక్టరీ- క్రాస్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
Full View