20 కోట్ల గ్రాస్ క్ల‌బ్ లో `ఓ బేబి`

Update: 2019-07-13 12:29 GMT
కొరియ‌న్ మూవీ `మిస్ గ్రానీ` రీమేక్ గా తెర‌కెక్కిన‌ `ఓ బేబి` తెలుగు రాష్ట్రాలు స‌హా రిలీజైన అన్నిచోట్లా చ‌క్క‌ని వ‌సూళ్లు చేస్తోంద‌ని తాజా రిపోర్ట్ చెబుతోంది. స‌మంత మ‌రో చ‌క్క‌ని విజ‌యాన్ని ఖాతాలో వేసుకున్నార‌న్న ముచ్చ‌టా సాగుతోంది. `అలా మొద‌లైంది` త‌ర్వాత చాలా గ్యాప్ వ‌చ్చినా ద‌ర్శ‌కురాలు నందిని రెడ్డికి మ‌ర‌పురాని స‌క్సెస్ గా నిలిచింది. ఓ బేబి తొలి వారం ఏకంగా 11కోట్ల షేర్ .. 20 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంద‌ని తాజాగా రిపోర్ట్ అందింది.

తొలి ఏడు రోజుల్లో షేర్ వివ‌రాల్ని ప‌రిశీలిస్తే.. నైజాం-3.20 .. సీడెడ్-85ల‌క్ష‌లు.. వైజాగ్ -1.10కోట్లు.. తూ.గో జిల్లా-47 ల‌క్ష‌లు.. ప‌.గో జిల్లా-38ల‌క్ష‌లు.. కృష్ణ -63ల‌క్ష‌లు.. గుంటూరు- 50 ల‌క్ష‌లు .. నెల్లూరు- 22ల‌క్ష‌లు.. ఓవ‌రాల్ ఆంధ్రా 3.3 కోట్లు వ‌సూలైంది. నైజాం- ఏపీ క‌లుపుకుని 7.35 కోట్ల షేర్ వ‌సూలైంది. అమెరికా-2.4కోట్లు.. క‌ర్నాట‌క‌-8ల‌క్ష‌లు.. ఇత‌ర భార‌త‌దేశం నుంచి 5ల‌క్ష‌లు వ‌సూలైంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 11.05కోట్ల షేర్ వ‌సూలైంది.

7రోజుల్లో `ఓ బేబి` గ్రాస్ వివ‌రాల్ని ప‌రిశీలిస్తే నైజాం-5.6 కోట్లు.. సీడెడ్ -1.4కోట్లు.. ఆంధ్రా -5కోట్లు.. నైజాం-ఏపీ క‌లుపుకుని 12కోట్లు వ‌సూలైంది. అమెరికా-4.8 కోట్లు.. క‌ర్నాట‌క -2.1కోట్లు.. ఇత‌ర భార‌త‌దేశం నుంచి 1.3కోట్లు వ‌సూలు చేసింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 20.2 కోట్ల గ్రాస్ వ‌సూలైంద‌ని ట్రేడ్ రిపోర్ట్ అందింది. చాలా చోట్ల‌ ఇంకా స్ట‌డీగా క‌లెక్ష‌న్లు ద‌క్కుతున్నాయ‌ని తెలుస్తోంది. ఫుల్ ర‌న్ లో ఓ బేబి ఇంకెన్ని రికార్డులు అందుకుంటుందో వేచి చూడాలి.

    

Tags:    

Similar News