యు/ఎ అంటూ ఇర్రిటేషన్‌ చేస్తారా?

Update: 2015-04-11 23:30 GMT
తమిళ స్టార్‌ డైరెక్టర్‌ మణిరత్నం ఎంతో కసిగా తెరకెక్కించిన సినిమా 'ఒకే బంగారం'. ఈ సినిమాతో కోల్పోయిన పూర్వ వైభవాన్ని తిరిగి ఒడిసిపట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారాయన. మమ్ముట్టి తనయుడు దుల్కార్‌ సల్మాన్‌, నిత్యామీనన్‌ జంటగా తెరకెక్కించిన ఈ సినిమా ఓ క్యూట్‌ లవ్‌స్టోరి. ఏ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం అందించారు. పాటలు ఇటీవలే రిలీజై శ్రోతల మెప్పు పొందుతున్నాయి. సెన్సార్‌ పూర్తయింది. యు/ఎ సర్టిఫికెట్‌ దక్కింది.

అయితే ఈ సినిమాకి యు/ఎ ఇవ్వడంపై సినిమాటోగ్రాఫర్‌ పి.సి.శ్రీరామ్‌ చాలా సీరియస్‌ అయ్యారని సమాచారం. అవసరం లేకపోయినా ఇలా 'ఎ' ఎందుకు కలపాల్సొచ్చింది? ఎలాంటి అనుచితమైన సన్నివేశాలు సినిమాలో లేవే అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సెన్సార్‌ బృందం మరీ ఇర్రిటేట్‌ చేస్తుందని పీసీ సీరియస్‌ అయ్యారట. అంతేకాదు ఈ సినిమాలో 'బొంబాయి' అన్న పదాన్ని కట్‌ చెప్పింది సెన్సార్‌. దీనిపైనా ఆయన కాస్త సీరియస్‌ అయ్యారుట.

మణిరత్నం-పీసీ శ్రీరామ్‌-ఏ.ఆర్‌.రెహమాన్‌ కలయికలో ఎన్నో క్లాసిక్స్‌ తెరకెక్కాయి. మరోసారి ఈ కలయికలో వస్తున్న సినిమాగా ఇప్పటికే బోలెడంత క్రేజు తెచ్చుకుంది. ముఖ్యంగా మణిరత్నం మార్క్‌ సినిమా చూడబోతున్నామన్న ఉత్సాహం ఆయన అభిమానుల్లో కనిపిస్తోంది. ఒకే బంగారం ఈ నెల 17న రిలీజవుతోంది. ఫలితం కోసం కాస్త వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News