కార్తికేయ 2 ని తలపిస్తున్న శర్వా 'ఒకే ఒక జీవితం'..!

Update: 2022-09-12 05:45 GMT
నిఖిల్‌ హీరోగా నటించిన కార్తికేయ 2 సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీలో ఈ సినిమాను విడుదల చేసిన విషయం తెల్సిందే.

కార్తికేయ 2 సినిమా అనూహ్యంగా హిందీలో మెల్ల మెల్లగా పుంజుకుని భారీ విజయం ను సొంతం చేసుకుంది. ఇప్పుడు అదే తరహాలో ఒకే ఒక జీవితం సినిమాకు సంబంధించిన తమిళనాట వసూళ్లు పెరుగుతూ ఉన్నాయని టాక్ వినిపిస్తుంది. శర్వానంద్‌ హీరోగా రీతూ వర్మ హీరోయిన్ గా రూపొందిన ఒకే ఒక్క జీవితం సినిమాను తమిళంలో కణం పేరుతో విడుదల చేయడం జరిగింది.

మొదటి రోజు సినిమాను జనాలు పట్టించుకోలేదు. కానీ మౌత్‌ టాక్‌ తో మెల్ల మెల్లగా వసూళ్లు పెరిగాయి. వీకెండ్‌ లో సినిమాకు మంచి స్పందన దక్కింది. శర్వానంద్ సినిమా తమిళం లో సక్సెస్ అయ్యి చాలా సంవత్సరాలు అయ్యింది. మళ్లీ ఇన్నాళ్లకు తమిళనాట శర్వాకు ఈ సినిమా తో సక్సెస్ దక్కిందని బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో శని మరియు ఆది వారాల్లో ఒకే ఒక జీవితం సినిమాకు మెజార్టీ స్థాయి వసూళ్లు నమోదు అయ్యాయి. దాదాపుగా 85 శాతం ఆక్యుపెన్సీ నమోదు అయినట్లుగా తెలుస్తోంది. పదుల సంఖ్యలో థియేటర్లలో హౌస్ ఫుల్‌ బోర్డులు కనిపించాయి.

తమిళనాట కూడా ఈ సినిమా కణంగా ఆకట్టుకుంటుంది. టైమ్ ట్రావెల్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా లో అక్కినేని అమల కీలక పాత్రలో నటించిన విషయం తెల్సిందే.

సినిమాకు సంబంధించిన టాక్ పాజిటివ్‌ గా ఉండటం తో వీక్ డేస్ లో అంటే నేటి నుండి వసూళ్లు ఎలా ఉంటాయా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీక్‌ డేస్ లో స్ట్రాంగ్‌ గా వసూళ్లు ఉంటే సాలిడ్ ప్రాఫిట్స్ ఖాయం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News