పాత తరం హీరోల్లో శోభన్ బాబుకు ఉన్న క్రేజు మామూలుది కాదు. ఆయన తన అందంతో అమ్మాయిల మనసు దోచేవాడంటే అతిశయోక్తి కాదు. అందుకే.. ఆయన్ను అందరూ సోగ్గాడు అని పిలిచేవారు. ఆ విధంగా సినిమా ఇండస్ట్రీలో టాప్ స్టార్ గా వెలిగిన శోభన్ బాబు.. బిజినెస్ మ్యాన్ గా కూడా సత్తాచాటాడు. ప్రధానంగా రియల్ ఎస్టేట్ అంటే ఏంటో తెలియని ఆ రోజుల్లోనే ఫేమస్ రియల్ ఎస్టేట్ బిజినెస్ మెన్ గా ఆయన చరిత్ర సృష్టించారంటే అతిశయోక్తి కాదు. ఆ విధంగా ఆయన వేలాది కోట్లు కూడబెట్టారు. కేవలం ఆయన డ్రైవర్ ఆస్తులు చూస్తేనే నోరెళ్ల బెట్టడం ఖాయం.
‘‘ఈరోజు వరకు భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన హీరోల్లో.. శోభన్ బాబును మించిన ధనవంతుడు లేడు.’’ అన్నారు ఆయన స్నేహితుడు మురళీ మోహన్. ఓ ఇంటర్వ్యూలో శోభన్ బాబు గురించి మాట్లాడిన మురళీ మోహన్.. ఎవ్వరికీ తెలియని ఆశ్చర్యకరమైన నిజాలను వెల్లడించారు. ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఎలా ఎదిగారో వివరించారు. మద్రాసులో ఆయన స్టార్ హీరోగా ఉన్నపుడు కొన్ని వేల ఎకరాలు కొన్నాడని.. అవన్నీ ఇప్పుడు లెక్కలేస్తే కొన్ని వేల కోట్లు అవుతాయని చెప్పారు. శోభన్ బాబు చనిపోయే నాటికి ఆయన ఆస్తి దాదాపు 80 వేల కోట్లు ఉంటుందట.
1976లోనే కొన్ని మేజర్ కంపెనీలలో షేర్స్ తీసుకున్నాడని.. అప్పట్లో షేర్ అనే మాట కూడా సామాన్యులకు తెలియదని చెప్పారు. చెన్నై శివార్లలో శోభన్ బాబుకు సంబంధించిన స్థలాలు కొన్ని వేల ఎకరాలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు మురళీ మోహన్. ఆయన స్పూర్థితోనే తాను కూడా రియల్ ఎస్టేట్ చేయడం మొదలుపెట్టినట్లు చెప్పాడు. మద్రాసులో ఆయన టైమ్ పాస్ కోసం పొద్దున్నే తన బిల్డింగులు అన్నీ చూడ్డానికి వెళ్తే సాయంత్రానికి ఇంటికి వచ్చేవారని.. దాన్ని బట్టి ఆయన ఆస్తులు లెక్కలేసుకోండి అంటూ ఓ సినీ విశ్లేషకుడు చెప్పడం విశేషం.
ఇదిలాఉంటే.. శోభన్ బాబు డ్రైవర్ కూడా కోట్ల రూపాయలకు అధిపతి అయ్యాడని చెప్తుంటారు. శోభన్ బాబు బయటి వ్యక్తులకు పెద్దగా సహాయం చేయకపోయినప్పటికీ తన చుట్టూ ఉన్న వాళ్లను మాత్రం బాగా చూసుకున్నారని చెబుతుంటారు. ఆయనకు రియల్ ఎస్టేట్‌పై అవగాహన కల్పించి సెటిల్ అయ్యేలా చేశాడని చెప్తుంటారు శోభన్ బాబు సన్నిహితులు.
బంధువులు, సన్నిహితులకు కూడా సాయం చేశారని, కేవలం ఆయన కారణంగానే కొందరు కోట్లాది రూపాయల ఆస్తులు సంపాదించుకున్నారని చెబుతుంటారు. ఇందులో మురళీ మోహన్, చంద్రమోహన్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే డ్రైవర్ కూడా ఆస్తులు కూడబెట్టుకున్నారని, ప్రస్తుతం అతని ఆస్తులు దాదాపు 100 కోట్లకు పైగానే ఉంటాయని అంటున్నారు. మొత్తానికి భూమిని నమ్ముకుంటే.. అది ఎన్నాళ్లకైనా రెట్టింపు తిరిగి ఇస్తుందని శోభన్ బాబు ఆనాడే నమ్మారు. సక్సెస్ అయ్యారు. తన చుట్టూ ఉన్నవారిని కూడా విజయపథాన నడిపించారన్నమాట.