రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్ కోసం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. చరణ్ కు జోడీగా బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియా భట్ నటిస్తూ ఉండగా ఎన్టీఆర్ కు జోడీగా మొదట విదేశీ హాలీవుడ్ నటిని ఎంపిక చేస్తే ఆమె తప్పుకుంది. ఆ తర్వాత లండన్ కు చెందిన స్టేజ్ ఆర్టిస్ట్ ఓలీవియాను ఎంపిక చేశారు.
ఇప్పటికే ఆమెతో కొన్ని సీన్స్ షూట్ కూడా చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఆమెతో ఇంకా మెజర్ పార్ట్ షూటింగ్ చేయాల్సి ఉందట. కాని ప్రస్తుత పరిస్థితుల్లో విదేశాల నుండి రాకపోకలు జరగడం సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. అంతర్జాతీయ విమానాలు నడవాలంటే కనీసం రెండు మూడు నెలలు అయినా సమయం పడుతుందని అంటున్నారు. అప్పటికి కూడా విపరీతంగా కరోనా వ్యాప్తి చెందుతున్న లండన్ నుండి ఇండియాకు రాకపోకలు ఉంటాయో ఉండవో తెలియని పరిస్థితి.
ఇండియాలో లాక్ డౌన్ ను ఎత్తివేసిన వెంటనే షూటింగ్ చేయాలనుకున్న జక్కన్నకు ఇదో పెద్ద సమస్యగా మారింది. ఓలీవియాను ఇండియాకు తీసుకు వచ్చి ఆమెను నటింపజేస్తేనే షూటింగ్ పూర్తి అయ్యే పరిస్థితి. మరి ఆమె స్థానంలో మరెవ్వరినైనా తీసుకుంటారా లేదంటే ఆమె కోసం వెయిట్ చేస్తారా అనేది చూడాలి.
ఓలీవియా మాత్రమే కాకుండా మరో ఇద్దరు ముగ్గురు నటులు కూడా విదేశాల నుండి ఈ సినిమా షూటింగ్ కోసం రావాల్సి ఉంది. వారి రాక కూడా ఇబ్బందిగానే ఉంది. కనుక ఈ విషయం ఆర్ ఆర్ ఆర్ టీంకు కొత్త సమస్యగా దాపరించింది. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తానంటున్న జక్కన్నకు ఈ సమస్య సవాల్ విసురుతుంది. మరి ఈ సమస్య నుండి ఆర్ ఆర్ ఆర్ టీం ఎలా బయట పడుతుందో చూడాలి.