రాజమౌళి సినిమా 'ఆర్ ఆర్ ఆర్' తో ప్రేక్షకులకు పరిచయం అవ్వబోతున్న బ్రిటీష్ బ్యూటీ ఒలివియా మోరిస్ తాజాగా హైదరాబాద్ రోడ్ల మీద చక్కర్లు కొట్టింది. ఇటీవల ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ ను ముగించారు. గత కొన్ని నెలలుగా షూటింగ్ తో బిజీ బిజీగా గడిపిన యూనిట్ సభ్యులు ఎట్టకేలకు ఫ్రీ అయ్యారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ షూటింగ్ ను ముగించిన తర్వాత స్టార్స్ అంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఒలివియా షూటింగ్ ను ముగించుకుని హైటెక్స్ మరియు శిల్పారామం ను ఆమె సందర్శించింది.
ఈ సందర్బంగా సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఫొటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హైటెక్ సిటీలో సరదాగా గడిపిన ఒలివియా ఆ తర్వాత దహి పూరి ని కూడా టేస్ట్ చేసింది. రోడ్డు సైడ్ ఫుడ్ తో పాటు కొన్ని చిన్న చిన్న థింగ్స్ ను కూడా ఆమె షాపింగ్ చేసిందట. మొత్తానికి హైదరాబాద్ సిటీ లైఫ్ ను ఎంజాయ్ చేసినట్లుగా ఆమె పేర్కొంది.
ఒలివియా తో ఆర్ ఆర్ ఆర్ సినిమాకు స్టైలిష్ట్ గా చేసిన అను రెడ్డి కూడా ఉన్నారు. ఇద్దరు కలిసి అలా సరదాగా హైదరాబాద్ లో చక్కర్లు కొట్టారు. అను రెడ్డి సోషల్ మీడియాలో పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసింది. ఒలివియా ను సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది తెలుగు అభిమానులు ఫాలో అవుతున్నారు. ఆమె నెట్టింట షేర్ చేసిన ఫొటోలు మరియు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాదిలో ఈ సినిమాను విడుదల చేస్తారని తెలుస్తోంది.