యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరెక్కించిన పౌరాణిక చిత్రం ''ఆదిపురుష్''. రామాయణం ఇతిహాసం ఆధారంగా భారీ బడ్జెట్ తో టీ-సిరీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. అయితే భారీ అంచనాల నడుమ ఇటీవల విడుదలైన టీజర్ కు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది.
'ఆదిపురుష్' సినిమాలో రాఘవగా ప్రభాస్.. జానకిగా కృతి సనన్.. లంకేశ్ గా సైఫ్ అలీఖాన్.. లక్ష్మణుడిగా సన్నీ సింగ్ మరియు హనుమంతుడిగా దేవ్ దత్తా నటించారు. అయితే ట్రైలర్ లో ప్రధాన పాత్రల చిత్రీకరణ మీద అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
ఓవైపు టీజర్ లో విజువల్ ఎఫెక్ట్స్ నాసిరకంగా ఉన్నాయని నెటిజన్లు ట్రోలింగ్ చేస్తుంటే.. మరోవైపు రావణుడు - ఆంజనేయుడు పాత్రల లుక్స్ మరియు వేషధారణపై కొన్ని రాజకీయ పక్షాలు - హిందూ వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి. 'ఆదిపురుష్' చిత్రాన్ని బ్యాన్ చేయాలని కూడా డిమాండ్ చేశారు.
అయితే లేటెస్టుగా ఓ హిందీ ఛానల్ తో దర్శకుడు ఓం రౌత్ మాట్లాడుతూ.. ట్రోలింగ్ మరియు వివాదంపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. రామాయణ గాథను నేటి యువతరం మరియు పిల్లలకు అర్థమయ్యేలా.. వారి అభిరుచికి తగ్గట్లు చెప్పాలనే ప్రయత్నంలో భాగంగా ఇదంతా జరిగిందని దర్శకుడు తెలిపారు.
గతంలో ఆధారంగా తెరకెక్కిన సినిమాలు సీరియల్స్ అప్పటి ట్రెండుకు తగ్గట్లుగా ఉన్నాయని.. ఇప్పటి ప్రేక్షకులు 'హ్యారీ పోర్టర్' లాంటి సినిమాలకు అలవాటు పడ్డారని.. అందుకే వారిని ఆకట్టుకోవడానికి ప్రస్తుత టెక్నాలజీని ఉపయోగించి రామాయణాన్ని మోడర్న్ గా చూపించే ప్రయత్నమే ఈ సినిమాలో జరిగిందని ఓం రౌత్ వివరించాడు.
రావణుడు అంటే రాక్షసుడు.. చెడుకు ప్రతీక అని భావిస్తుంటామని.. ప్రస్తుత కాలంలో ఒక చెడ్డ వ్యక్తి ఎలా ఉంటాడనే ఊహతో ఈ పాత్రను తీర్చిదిద్దినట్లు 'ఆది పురుష్' డైరెక్టర్ తెలిపారు. లంకేశ్ పక్షి మీద పయనించడంపై మాట్లాడుతూ.. పుష్పక విమానం మీదే రావణుడు విహరించినట్లు ఎక్కడా ఆధారం లేదని ఆయన అన్నారు.
ఆ కాలంలో అనేక రకాల జీవులు ఉండేవని.. ఎవరి విజన్ కు తగ్గట్లుగా వాళ్లు వాటిని చూపించవచ్చని దర్శకుడు అభిప్రాయ పడ్డారు. రామాయణానికి మోడర్న్ వెర్షన్ లాగా ‘ఆదిపురుష్’ సినిమాని తీర్చిదిద్దాలన్న ఆలోచనతోనే ఇలాంటి ప్రయత్నం చేశామని ఓం రౌత్ వివరించారు.
అలానే ఇటీవల దర్శకుడు ఓం రౌత్ 'ఆది పురుష్' ట్రోలింగ్ పై మాట్లాడుతూ.. ఈ సినిమా బిగ్ స్క్రీన్ కోసం తీశామని.. మొబైల్ ఫోన్స్ లో చూడటానికి భిన్నంగానే ఉంటుందని అన్నారు. పెద్దల నుంచి పిల్లల వరకు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా.. అందరికీ అర్థమయ్యే భాషలో ఎక్కువ మందికి చేరువ చేసేందుకు 3డీ మోషన్ టెక్నాలజీలో ఈ సినిమా చేశామని తెలిపారు.
దర్శకుడు చెప్పినట్లుగా 'ఆది పురుష్' 3-డీ వెర్షన్ టీజర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. శుక్రవారం రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రధాన థియేటర్లలో టీజర్ ను ప్రదర్శించారు. బిగ్ స్క్రీన్ మీద డిఫరెంట్ ఎక్స్పీరియర్స్ ఇచ్చిందని అంటున్నారు. మరి వచ్చే జనవరి 12న థియేటర్లలో ఫుల్ మూవీ ఎలాంటి అనుభూతిని పంచుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.