ఓంకార్ అన్నయ్య.. ఈ మాట వింటే చాలు.. బుల్లితెర ప్రపంచం కనిపిస్తుంది. అక్కడ అంతగా పాపులర్ అయిన పేరు ఇది. ఓంకార్ ఓ యాంకర్ గా కెరీర్ ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగాడు. సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి సినిమాలు నిర్మించే స్థాయికి ఎదిగాడు. అంతేనా తనని తాను డైరెక్టర్ గానూ ప్రమోట్ చేసుకుంటున్నాడు. తొలి ప్రయత్నం జీనియస్ పరాజయం చవిచూసినా, అదరక బెదరక రాజుగారి గది అనే హారర్ చిత్రం తీసి హిట్ కొట్టేశాడు. ఈ మూవీ తర్వాత ఓంకార్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది.
అయితే అతడిపై ఇప్పటికే యూట్యూబ్ లో, మీడియాలో జుగుప్స కలిగించే కామెడీ బోలెడంత ఉంది. ఓంకార్ ని టార్గెట్ చేసి కొందరు మిమిక్రీ ఆర్టిస్టులు రచ్చ రచ్చ చేశారు. ఇప్పటికీ ఆ వీడియోలు ఆన్ లైన్ లో కనిపిస్తూనే ఉంటాయి. అయితే సక్సెస్ అందుకుని రేసులో దూసుకుపోయేవాడికి, అసలు సక్సెస్ అన్న పదానికి అర్థం తెలియనివారికి మధ్య ఉన్న తేడా ఏంటో? అతడు ప్రాక్టికల్ గా చూపించాడు. నవతరం అందరకీ అతడు ఓ ఇన్ స్పిరేషన్. ఎంచుకున్న రంగంలో ఎలా ఎదగాలి? అన్నదానికి అతడే పర్యాయంగా కనిపిస్తున్నాడు. కలలు కను.. వాటిని సాధించుకునేందుకు శ్రమించు అన్న అబ్దుల్ కలాం సూచనను ఓంకార్ పాటించి విజయం అందుకున్నాడు. తన గురించి మాట్లాడే వాళ్లెవరికీ అంత సీనే లేదు. మింగ మెతుకు లేని మాడాల్లానే ఇంకా కృష్ణానగర్ రోడ్లపై తిరిగేస్తున్నారు.
ఇంతకీ ఓ షాకింగ్ మ్యాటర్ తెలుసా? అసలు ఓంకార్ యాంకర్ కాకముందు డాక్టర్. అతడు ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టరుగా మెడ్విన్స్ హాస్పిటల్ లో నాలుగు సంవత్సరాలు పనిచేశాడు. ఇది సూపరు కదూ. సాధారణంగా మెడిసిన్ చదువు మానేసి అమ్మాయిలు హీరోయిన్లు అయిపోతుంటారు. కాని మనోడు పూర్తి చేసి పనిచేస్తూ యాక్టర్ అయ్యాడు. ఇంతకీ ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నావా గురూ అంటే.. కేవలం మా చుట్టాలకే చూస్తున్నా అంటున్నాడు.