స్పూఫ్ లే అతనికి మరింత సహాయపడ్డాయట..

Update: 2015-10-31 03:50 GMT
వెండితెరపై అన్నా అన్న పిలుపుకి ఎన్.టి.ఆర్, చిరంజీవి పరిమితమైతే బుల్లితెరపై మాత్రం ఆ ఛాన్స్ ని యాంకర్ ఓంకార్ కొట్టేసాడు. క్రియేటివ్ థింకింగ్ తో, రియాలిటీ టేకింగ్ తో ఆట, ఛాలెంజ్ సిరీస్ లను తెరకెక్కించి ఆయా టి.వి చానళ్ళకు అప్పట్లో అత్యధిక టి.ఆర్.పి లు సంపాదించిపెట్టాడు. రాను రానూ ఓంకార్ ఐడియాలు పాతవైపోవడం, షోలలో ఆటను కావాలని పెట్టే గొడవలు సహజమైపోవడంతో ఆయన షోలకు గిరాకీ తగ్గింది.

దీనికి తోడు తన తొలిచిత్రం జీనియస్ కోసం చేసిన హంగామా తీసిన తరువాత వచ్చిన అవుట్ పుట్ చూసిన సినీ లోకం అతణ్ణి పూర్తిగా పక్కన పెట్టేసారు. ఎన్నో ప్రశంసలు అందుకున్న ఓంకార్ పరిస్థితి ఒక్కసారిగా మారిపోవడం అతను సైతం జీర్ణించుకోలేకపోయాడు.

కొన్నాళ్ళ విరామం తరువాత ఇప్పుడు రాజు గారి గది సినిమాతో వేచి వున్న విజయం దక్కినా ఇది ఓంకార్ పూర్తి స్థాయి కమ్ బ్యాక్ కాదని అతని భావన. తనని తాను పూర్తిస్థాయిగా పరిచయం చేసుకోవాలని ఓంకార్ తపిస్తున్నాడు. తనపై వస్తున్న స్పూఫ్ లే తన విజయానికి నిదర్శనమని, తనకెంతో స్పూర్తిదాయకమని ఓంకార్ అన్నయ్య తెలిపాడు. 
Tags:    

Similar News