మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోన్న సంగతి తెలిసిందే. ప్రధానంగా పోటీ ప్రకాష్ రాజ్ ప్యానల్.. మంచు విష్ణు ప్యానల్ మధ్యే కొనసాగుతుందని మీడియా కథనాలు అంతకంతకు వేడెక్కిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండు వర్గాల మధ్య వా్ నడుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ప్రకాష్ రాజ్ ప్యానల్ కి మద్దతిస్తు న్నట్లు.. కృష్ణ..కృష్ణంరాజు..మురళీ మోహన్ లు విష్ణుకు సపోర్ట్ గా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో చిరంజీవి పేరు ఎక్కువగా హైలైట్ అవుతోంది. మెగా బ్రదర్ నాగబాబు ప్రకాష్ రాజ్ పక్షాన నిలబడటంతో సినీపెద్దగా ఉన్న చిరంజీవిని అందులోకి లాగుతున్నారు.
తెర వెనుకుండి అసలు కథ నడిపించేది అంతా మెగాస్టార్ అని ప్రచారం జరుగుతోంది. మరి నిజంగా మెగాస్టార్ ఇలాంటి విషయాల్లోకి కల్పించుకుంటారా? అంటే దానికి రుజువులేవీ లేవు! దర్శకరత్న దాసరి నారాయాణరావు తర్వాత మెగాస్టార్ ని పరిశ్రమ పెద్దగా 24 శాఖలు భావిస్తున్నాయి. పెద్ద అనే ఘనకీర్తి అందుకోవాలని ఆయన ఎప్పుడూ ఆశపడలేదు. కావాలనే అందులోకి లాగామని దాసరి శిష్యుడు తమ్మారెడ్డి భరద్వాజా అంతటి వారు అన్నారు. అంతేకాదు.. పరిశ్రమే ఆయన్ని గుర్తించి పెద్దగా మలుచచుకుంది. ఆ విషయంలో చిరంజీవి కూడా ఎంతో హుందాగానే ఉన్నారు. దాసరి తరహాలోనే చిన్న సినిమాల ప్రమోషన్ లో చొరవ తీసుకోవడం దగ్గర నుంచి ఏదైనా సమస్య వస్తే సామరస్యంగా చిరంజీవి ఇంట్లోనే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక కరోనా క్రైసిస్ కష్ట కాలంలో చిరంజీవి సేవల గురించి తెలిసిందే. సినిమా 24 శాఖల కార్మికులను ఆయన ఆదుకునే ప్రయత్నం చేశారు. దీనికి వారంతా కృతజ్ఞతా భావంతో ఉన్నారు.
అలాంటి వ్యక్తి `మా ` ఎన్నికల్లో ఏకపక్షంగా వ్యవహరించే అవకాశం ఉందా? అంటే అందుకు ఛాన్స్ లేదని ఆయన్ని దగ్గరగా చూసిన వాళ్లు చెబుతున్నారు. చిరంజీవి వ్యక్తిత్వం గురించి తెలిసిన వాళ్లు ఎవరైనా ఈ విషయాన్ని ఒప్పుకోవాల్సిందే అంటున్నారు. ``చెడు చెవిలో చెప్పుకోవాలి.. మంచిని గొప్పగా చెప్పుకోవాల``ని నమ్మే వ్యక్తి ఎన్నికల పట్ల తన స్థాయికి తగ్గట్టే వ్యవహరిస్తారు తప్ప.. ఒక్కరోజు ఎన్నికలు కోసం కుతంత్రాలు చేసే మనసు ఆయనది కాదని సన్నిహితులు చెబుతున్నారు. మెగా కాంపౌండ్ అంటే గిట్టని వారే ఇలాంటి కట్టు కథనాలు ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు.
ఇకపోతే మెగాస్టార్ పైనా పవన్ కల్యాణ్ పైనా తీవ్ర విమర్శలు చేసిన జీవిత రాజశేఖర్ ని మెగామద్ధతు ఉందని చెబుతున్న ప్రకాష్ రాజ్ ప్యానెల్లోకి చేరనిస్తారా? చిరు ఇన్వాల్వ్ కారనడానికి ఇంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ కావాలా? అని ప్రశ్నించేవారు లేకపోలేదు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ ప్యానెల్ కి వ్యతిరేకంగా పని చేస్తున్న వీకే నరేష్ ని సైతం మెగాస్టార్ సపోర్ట్ చేశారు. మంచు విష్ణు కి వ్యతిరేకంగా ఇప్పటివరకూ మెగాస్టార్ కానీ ఆయన కాంపౌండ్ కానీ ఏ విధమైన కామెంట్ ని కూడా చేయలేదు. తన ఫ్రెండు సాటి సినీపెద్ద మంచు మోహన్ బాబు తన కుమారునికి మద్ధతు కావాలని కోరితే ఇచ్చేందుకు చిరు వెనకాడరన్న గుసగుస కూడా ఒక సెక్షన్ ఆర్టిస్టుల్లో ఉంది. 950 మంది సభ్యులున్న మూవీ ఆర్టిస్టుల సంఘానికి అక్టోబర్ 10న ఎన్నికలు జరగనున్నాయి. 2021 దసరా నుంచి 2024 దసరా వరకూ ఈసారి టెర్మ్ కనసాగుతుందని తెలుస్తోంది. కరోనా క్రైసిస్ వల్ల కొన్ని సందిగ్ధతలు ఏర్పడ్డాయి. ఈసారి కమిటీ సీజన్ ని రెండు సంవత్సరాలుగా నిర్ణయించారా లేదూ మూడు సంవత్సరాలా? అన్నదానిపై మరింత స్పష్ఠత రావాల్సి ఉంది.