మెగా - నందమూరి వార్ గురించి తెలిసిందే. ఆయనెవరో తెలీదు అంటూ ఘాటైన విమర్శలు, సెటైర్లతో విరుచుపడుతూ వేడెక్కిస్తున్నారు. ఇటీవలే నందమూరి బాలకృష్ణ ఎవరో తెలీదు అంటూ మెగా బ్రదర్ నాగబాబు కౌంటర్ వేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి నాగబాబు ఓ వీడియోని ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడం, అది జనాల్లో జోరుగా వైరల్ అవ్వడం చర్చకొచ్చింది. ఇది బాలయ్యకు కౌంటరేనా? అంటూ రచ్చ మొదలైంది.
ఈ వీడియోలోని బాలకుడు దేశభక్తి గీతం `సారే జహాసే అచ్చా`ని ఆలపించిన తీరు మెస్మరైజ్ చేస్తోంది. ఎక్కడా తప్పు అన్నదే లేకుండా.. తడబాటు అన్నదే లేకుండా ఆలపించిన తీరు అందరినీ నిశ్చేష్టుల్ని చేస్తోంది. ఒక దేశభక్తి గీతాన్ని దాని ప్రాశస్త్యం చెడకుండా పాడటంలో భళారే అనిపించాడు. చిచ్చరపిడుగులా పాడాడంటే అతిశయోక్తి కాదు.
అయితే ఈ వీడియోని ప్రత్యేకించి నాగబాబు ఎఫ్‌బీలో పోస్ట్ చేయడం వెనక కారణమేంటి? అంటూ ప్రస్తుతం ఆరాలు మొదలయ్యాయి. ఇది బాలయ్యకు కౌంటరేనా? మొన్నటి రోజున తెలంగాణ ఎన్నికల్లో `సారే జహాసె అచ్చా` ఆలపించిన బాలయ్య తడబాటుకు కౌంటర్ వేసే ప్రయత్నమేనా? అంటూ అభిమానుల్లో డిబేట్ మొదలైంది. దీనిపై తెలుగు రాష్ట్రాల పొలిటికల్ కారిడార్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఒక దేశభక్తి గీతాన్ని ఆలపించేప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. నిబద్ధతతో పాడాల్సి ఉంటుంది. తడబడుతూ పాడి నవ్వుల పాలవ్వడం సరికాదనే నాగబాబు చెప్పదలిచారా? అంటూ సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికర డిబేట్ సాగుతోంది. బాలయ్య ఎవరో తెలీదు.. అతడో కమెడియనా? అంటూ కామెంట్ చేసినప్పుడే మెగా - నందమూరి వార్ పీక్స్ కి చేరింది. ఇకపైనా ఏపీ ఎన్నికల వేళ ఎలాంటి భీకర పోరాటం జరగనుందో అంటూ ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. నాగబాబు ఆ బాలకుడి వీడియోని ఏ ఉద్ధేశంతో పోస్ట్ చేసినా, అది బాలయ్యనుద్ధేశించేనన్న ముచ్చటా సాగడం విశేషం.