ఒకప్పుడు యూట్యూబ్ వ్యూస్ అంటే బోలెడంత హైప్.. హంగామా. ఇక ఒక మిలియన్ వ్యూస్.. లక్షల కొద్దీ లైక్స్ సాధించడం అంటే మహా కష్టమైన విషయం. అప్పట్లో బాహుబలి మొదటి భాగం ట్రైలర్ సాధించిన లైక్స్ ఎన్నో తెలుసా?? సినిమా రిలీజ్ అయిన ఐదారు నెలలకు కూడా 37వేలు మాత్రమే. ఇప్పటికీ లైక్స్ 45 వేలు మాత్రమే. వ్యూస్ అయితే.. ఇప్పటికి మొత్తం అన్ని ఛానల్స్ లో కలిపి ఓ 25 మిలియన్స్ ఉంటాయి.
కానీ ఇప్పుడు లెక్కలు మారిపోయాయి. ముఖ్యంగా జనాల చేతుల్లో స్మార్ట్ ఫోన్స్ పెరగడమే కాదు.. ఏకంగా జియో సిమ్ లు వచ్చి చేరాయి. ఎన్ని వందల సార్లు చూసినా పైసా బిల్లు కట్టాల్సిన పని లేకుండా 8 నెలలుగా ఈ జియో సిమ్ సేవలు అందిస్తోంది. నామమాత్రపు బిల్ తో ఇంకా నాలుగు నెలలు కంటిన్యూ చేయనుంది. అందుకే కుప్పలు తెప్పలుగా వ్యూస్ వచ్చి పడుతున్నాయి. ఇప్పుడు ఓ టీజర్.. ప్రోమో.. ట్రైలర్.. ఏదైనా సరే మిలియన్ వ్యూస్ సాధించిందంటే.. అదేమీ మహా గొప్ప చిత్ర రాజం అవాల్సిన పని లేదు. పేరు గొప్పగా ఉండాల్సిన పని అంతకంటే లేదు.
ఎటకారానికి ఎక్స్ ట్రీమ్ గా ఉంటుంది సంపూర్ణేష్ బాబు యాక్టింగ్. ఎప్పుడెప్పుడో మొదలుపెట్టిన కొబ్బరి మట్టకు.. ఇప్పుడు తాజాగా ఓ సాంగ్ ప్రోమో వదిలారు. ఇది కూడా 1 మిలియన్ వ్యూస్ అతి తక్కువ టైమ్ లోనే దాటేయడం విశేషం. సంపూ చేసిన పిచ్చి డ్యాన్సులు జనాలను తెగ నవ్వించేయగా.. ఈ సాంగ్ టీజర్ 10 లక్షల వ్యూస్ అందుకుంది.
ఇదంతా చూస్తుంటే 1 మిలియన్ వ్యూస్ అనేది ఇకపై బెంచ్ మార్క్ గా మర్చిపోవాల్సిన టైం వచ్చిందేమో అనిపించడంలో ఆశ్చర్యం లేదు. సంపూర్ణేష్ బాబు ఈ మార్క్ అందుకున్నాడు కాబట్టి.. విలువ లేదని అనడం కాదు. జనాల చేతుల్లో కోట్లాది సెల్ ఫోన్స్ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎలా కాదన్నా.. ఓ 50 లక్షల జియో సిమ్ లు అయినా ఉంటాయి. జియో దెబ్బకి ఇప్పుడు అన్ని కంపెనీలు రోజుకో జీబీ ఇచ్చేస్తామంటున్నాయి. అంటే ఇకపై యూట్యూబ్ వ్యూస్ ఇకపై పెద్ద విషయమేమీ కాదు.
పైగా యూట్యూబ్ లో ట్రైలర్ చూసినోళ్లంతా సినిమా చూస్తారని లెక్కలేమీ లేవు. బాహుబలి 2 ట్రైలర్ ఇప్పటికే 120 మిలియన్ వ్యూస్ దాటేసింది. సగటున టికెట్ రేట్ వంద రూపాయలు వేసుకున్న కలెక్షన్స్ 1200 కోట్లు వచ్చేయాలి. ఇదేమీ సులువైన విషయం కాదని గుర్తుంచుకోవాలి. ఇలాగే సంపూ సాంగ్ ప్రోమోను 10 లక్షల మంది చూశారంటే.. వాళ్లంతా సినిమా చూస్తే ఓ 10 కోట్ల కలెక్షన్స్ వచ్చేయాలి. ఇది కూడా అసాధ్యమే కదా.. అదీ లెక్క.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/