అలాంటి ఒక గొప్ప కవి 'సిరివెన్నెల'

Update: 2022-05-23 12:30 GMT
తెలుగు సినిమాకు త‌న‌దైన మార్కు ర‌చ‌న‌ల‌తో సిరివెన్నెల కురిపించారు దివంగ‌త ర‌చ‌యిత `సిరివెన్నెల` సీతారామ‌శాస్త్రి. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ని గుర్తు చేసుకున్నారు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌. సీతారామ‌శాస్త్రి జ‌యంతి సంద‌ర్భంగా విడుద‌లైన `సీతారామ‌శాస్త్రి స‌మ‌గ్ర సాహిత్యం`పై ప‌వ‌న్ క‌ల్యాణ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేంగా ఓ లెట‌ర్ ని విడుద‌ల చేశారు. `కవి తన రచనల ద్వారా అమరత్వం పొందుతాడు, లేక పోయినా స్ఫూర్తి ఇస్తాడు. పంచ భూతాలలో కలసి పొయినా రాబోయే తరానికి దిశా నిర్దేశం చేస్తూనే వుంటారు. అలాంటి ఒక గొప్ప కవి 'సిరివెన్నెల' గారికి, ఆయన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ నమస్సుమాంజలి` అని పేర్కొన్నారు.

అంతే కాకుండా సీరివెన్నెల సీతారామ శాస్త్రి ని మొద‌టి సారి చూసిన సంద‌ర్భాన్ని గుర్తు చేసుకున్నారు. సీతారామ‌శాస్త్రి జ‌యంతి సంద‌ర్భంగా విడుద‌లైన `సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి స‌మ‌గ్ర సాహిత్యం` మొద‌టి సంపుటి చూశాక ఆ అక్ష‌ర త‌ప‌స్విని మొద‌టి సారి `రుద్ర‌వీణ‌` సినిమా స‌మ‌యంలో క‌లిసిన సంద‌ర్భం గుర్తుకు వ‌చ్చింది.

అన్న‌య్య చిరంజీవిగారు న‌టించిన ఈ సినిమాకు అన్న‌య్య నాగ‌బాబు నిర్మాత‌గా ఉన్న ఈ చిత్రానికి నేను స‌హా నిర్మాత‌గా ఉంటూ నిర్మాణంలో పాలుపంచుకున్నాను.

అప్పుడు శాస్త్రి గారితో భేటీ అయ్యేవాణ్ణి, ఆ చిత్రంలోని `చుట్టూ ప‌క్క‌ల చూడ‌రా చిన్న‌వాడా` పాట‌లో చివ‌రి చ‌ర‌ణ్ ఇప్ప‌టికీ న‌న్ను వెంటాడుతూనే వుంటుంది. `నువ్వు తినే ప్ర‌తి ఒక మెతుకు ఈ సంఘం పండించింది. గ‌ర్వించే ఈ నీ బ్ర‌తుకు ఈ స‌మాజ‌మే మ‌లిచింది రుణం తీర్చు త‌ర‌ణం వ‌స్తే త‌ప్పించుకుపోతున్నావా తెప్ప త‌గ‌ల‌బెట్టేస్తావా ఏరు దాట‌గానే` అనే పంక్తులు ఇప్ప‌టికీ నా బాధ్య‌త‌ను గుర్తు చేస్తూనే వుంటాయి. న‌న్ను నిల‌బెట్టిన ఈ స‌మాజానికి రుణం తీర్చుకోవ‌డం నా బాధ్య‌తే!.

`మ‌న‌కున్న‌ది ప‌దిమందికీ పంచాలి` అది ప్ర‌కృతి ధ‌ర్వం అనే విష‌యాన్ని `రుద్ర‌వీణ‌`లోని త‌ర‌లిరాద త‌నే వ‌సంతం ..` పాట‌లో వినిపించారు. పంచే గుణ‌మే పోతే - ప్ర‌పంచ‌మే శూన్యం ఇది తెలియ‌ని మ‌నుగ‌డ క‌థ - దిశ‌నెరుగ‌ని గ‌మ‌న‌ము క‌థ‌` అనే పంక్తులలోని భావాన్ని అంద‌రం తెలుసుకోవాలి. ఏరు దాటాకా అవస‌రం తీరింద‌ని తెప్ప త‌గ‌ల‌బెట్టే ఆలోచ‌న‌ల‌తో బాధ్య‌తాయుత స్థానాల్లో ఉన్న వారు శాస్త్రిగారి సాహిత్యాన్ని చ‌దివి అర్థం చేసుకోవాలి. ఆయ‌న ర‌చ‌న‌లు అన్నింటిలోనూ క‌విగా ఆయ‌న‌లోని సామాజిక బాధ్య‌త క‌నిపిస్తుంది.

స‌మాజానికీ బాధ్య‌త‌లు గుర్తు చేసే దృక్ప‌థం అందులో నిక్షిప్త‌మై ఉంటుంది. ఆయ‌న అక్ష‌రాలు నిత్య చైత‌న్య కిర‌ణాలు. శాస్త్రిగారి ర‌చ‌న‌ల‌తోని గాఢ‌త‌ను చెబుతూ క‌విగా ఆయ‌న్ని మ‌రింత అర్థం చేసుకునేలా చేశారు త్రివిక్ర‌మ్ గారు. `సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి స‌మ‌గ్ర సాహిత్యం` అందిస్తున్నా తానా `బంధానికి నా హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు` అని తెలిపారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌.
Tags:    

Similar News