మహేష్ బిగ్గెస్ట్ రికార్డుకి ఏడాది పూర్తి

Update: 2016-08-07 05:53 GMT
టాలీవుడ్  సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు గతేడాది ఆగస్ట్ 7న విడుదలై భారీ సక్సెస్ ను సాధించింది. నాన్ బాహుబలి రికార్డులన్నిటినీ తుడిచేసిన ఈ మూవీ.. ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 150కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిన శ్రీమంతుడు.. మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాదు.. సూపర్ స్టార్ స్టామినాని ఇండస్ట్రీకి చూపించింది. ఇవాల్టితో ఆ సినిమా వచ్చి ఏడాది పూర్తయింది.

మహేష్ బాబు కెరీర్ లో శ్రీమంతుడు చాలా అంటే చాలా స్పెషల్. వరుస ఫ్లాపుల తర్వాత కొరటాల శివ కాంబినేషన్ లో మహేష్ బాబు సాధించిన ఈ విజయం సామాన్యమైనది కాదు. కమర్షియల్ మూవీకి సోషల్ మెసేజ్ ఎలిమెంట్స్ కలగలిపి.. బ్లాక్ బస్టర్ సాధించాడు. ఊరిని దత్తత తీసుకునే కాన్సెప్ట్ కి ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. దత్తత అంటే రోడ్లేయడం.. నీళ్లు తెప్పించడమే కాదని.. అక్కడ ఉన్న చెడును కూడా క్లీన్ చేసేస్తానంటూ మహేష్ బాబు  చెప్పిన డైలాగ్స్ కు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టేశారు

శ్రీమంతుడు తర్వాత మహేష్ బాబు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో గ్రామం చొప్పున దత్తత తీసుకున్నాడు. తన తండ్రి సొంత ఊరైన బుర్రిపాలెం.. తెలంగాణలో సిద్ధాపురంలను దత్తత తీసుకున్న మహేష్.. ఆ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాడు. సూపర్ స్టార్ వైఫ్ నమ్రత ఈ కార్యక్రమాలను తరచుగా పర్యవేక్షిస్తుండడం విశేషం.
Tags:    

Similar News