మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) అసోసియేషన్ అధ్యక్షుడిగా తనదైన మార్క్ వేసేందుకు ప్రయత్నిస్తున్నారు మంచు విష్ణు. ఇప్పటికే మా అసోసియేషన్ భవంతిని సొంత ఖర్చుతో నిర్మిస్తానని మాటిచ్చారు. స్థలాలు వెతికి భవంతి నిర్మాణంపైనా ఆయన ఆలోచిస్తున్నారు. అలాగే మా అసోసియేషన్ లో సంక్షేమ పథకాల విషయంలోనూ ఎక్కడా తగ్గడం లేదు.
ఇప్పుడు ఆర్టిస్టుల ఆరోగ్యంపైనా దృష్టి సారించారు. అసోసియేషన్ సభ్యులకు భరోసానిస్తూ ప్రముఖ కార్పొరెట్ ఆస్పత్రులతో విష్ణు ఒప్పందం చేసుకున్నారు. అపోలో-ఏఐజీ-మెడికవర్- కిమ్స్- సన్ షైన్ తో మా ఒప్పందం కుదిరింది. సదరు ఆస్పత్రుల్లో చికిత్సకు వెళితే.. ఓపీలో 50శాతం తగ్గింపు వర్తిస్తుందని.. అత్యవసర పరిస్థితుల్లో ఉచిత అంబులెన్స్ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. దశల వారీగా ఆర్టిస్టులకు ఆరోగ్య పరీక్షల్ని నిర్వహించనున్నామని మంచు విష్ణు వెల్లడించారు.
అంతా బాగానే ఉంది కానీ.. కార్పొరెట్ ఆస్పత్రులు దయాగుణంతో మెడికల్ బిల్స్ సహా ఇతరత్రా కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు ఆర్టిస్టులకు టోటల్ బిల్ లో 50 పర్సంట్ వర్తింపజేస్తే ఇంకా బావుంటుందని అంతా కోరుకుంటున్నారు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి సైతం పరిశ్రమ 24 శాఖల కార్మికులకు వైద్య సేవలు తక్కువ ధరలో అందించేందుకు ప్రముఖ కార్పొరెట్ ఆస్పత్రుల విభాగాన్ని కోరిన సంగతి తెలిసిందే. దానికి ఒప్పందం కుదిరింది.