సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార తాజాగా ప్రియుడు విఘ్నేష్ శివన్ తో మూడు ముళ్లు వేయించుకుని ఏడు అడుగులు వేసింది. సుదీర్ఘమైన వారి ప్రేమ బంధం ను వివాహ బంధం గా మార్చుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. హీరోయిన్ గా సౌత్ లో తనకంటూ ప్రత్యేక స్టార్ డమ్ ను ఇమేజ్ ను సొంతం చేసుకున్న నయనతార గత కొంత కాలంగా సినిమా సినిమాకు పారితోషికం పెంచుతూ వెళ్తోందట.
సౌత్ లో ఏ హీరోయిన్ కూడా తీసుకోనంత పారితోషికంను నయనతార తీసుకుంటుంది అంటూ ఆ మధ్య జాతీయ మీడియా కథనాల్లో కూడా చూశాం. మూడున్నర కోట్ల నుండి అయిదు కోట్ల వరకు నయన్ పారితోషికంగా తీసుకుంటుందట. ప్రస్తుతం బాలీవుడ్ లో చేస్తున్న ఒక సినిమాకు గాను నయన్ అయిదు కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.
నయన్ అంతగా పారితోషికం తీసుకుంటుంది కనుక ఆమె ఆదాయం అమాంతం పెరిగింది. తాజాగా ఒక జాతీయ మీడియా సంస్థ నయనతార మరియు విఘ్నేష్ శివన్ ల యొక్క ఆస్తుల వివరాలతో కూడిన ఒక ఆర్టికల్ ను పబ్లిష్ చేసింది. దాని ప్రకారం నయన్ మరియు విఘ్నేష్ శివన్ ల యొక్క మొత్తం ఆస్తి దాదాపుగా రూ.270 కోట్లుగా వారు పేర్కొన్నారు. అందులో మెజార్టీ వాటా నయనతార ఆస్తిగా వారు పేర్కొన్నారు.
నయనతార కు అత్యంత ఖరీదైన కార్లు ఉన్నాయట. అంతే కాకుండా సౌత్ లో ఏ హీరోయిన్ కు కూడా సాధ్యం కాని ప్రైవేట్ జెట్ ను కూడా నయనతార కలిగి ఉందని తెలుస్తోంది. రెగ్యులర్ గా కేరళ మరియు హైదరాబాద్ తిరుగుతూ ఉండే నయనతార కొన్నాళ్ల క్రితం ప్రైవేట్ జెట్ ను కొనుగోలు చేసింది అంటూ ఆ కథనంలో పేర్కొన్నారు.
నయనతార ప్రైవేట్ జెట్ విషయం గతంలో ఎప్పుడు కూడా మీడియాలో ప్రచారం జరగలేదు. అందరికీ తెలిసినా కూడా ఆ సమయంలో హడావుడి లేదు. కాని ఇప్పుడు సదరు జాతీయ మీడియా కథనం తో అనూహ్యంగా నయనతార ప్రైవేట్ జెట్ గురించి తెగ చర్చ జరుగుతోంది. నయన్ ఏకంగా విమానం కలిగి ఉందంటే నమ్మలేకుండా ఉన్నాం అంటూ బాలీవుడ్ హీరోయిన్స్ సైతం షాక్ అవుతున్నారు.
బాలీవుడ్ స్టార్స్ ల్లో అమితాబచ్చన్ తో పాటు ఒక్కరు ఇద్దరికి మాత్రమే ప్రైవేట్ జెట్ ఉంది. సౌత్ లో అక్కినేని ఫ్యామిలీకి మరియు ఒకటి రెండు ఉండి ఉంటాయి. ప్రైవేట్ జెట్ ను కలిగి ఉండటం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది ఒక హీరోయిన్ అయిన నయన్ కు ప్రైవేట్ జెట్ కలిగి ఉందనే వార్తలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఇండస్ట్రీ లో సుదీర్ఘ కాలంగా సినిమాలు చేస్తున్న నయన్ తార తన కెరీర్ ను పక్కా కమర్షియల్ గా ప్లాన్ చేసుకుంది. వచ్చిన ఆదాయంను సరిగా సద్వినియోగం చేసుకుంటూ ఉండటం వల్ల చాలా తక్కువ సమయంలోనే వంద కోట్లకు పైగా ఆస్తులను నయన్ సంపాదించింది. నయన్ దాదాపుగా 170 కోట్ల రూపాయల ఆస్తులను కలిగి ఉండగా విఘ్నేష్ వంద కోట్ల వరకు కలిగి ఉన్నాడు అంటూ ఆ జాతీయ మీడియా సంస్థ పేర్కొంది.