మోహన్ బాబు చాలా రిస్క్ చేస్తున్నారే

Update: 2017-12-31 10:21 GMT
చాలా కాలం గ్యాప్ తర్వాత సోలో హీరోగా ప్రేక్షకుల తీర్పు కోసం మళ్ళి వస్తున్న కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కొత్త సినిమా 'గాయత్రి' షూటింగ్ చివరి దశలో ఉంది. షూటింగ్ కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ బయటికి ఇవ్వకుండా జాగ్రత్త పడిన లక్ష్మి ప్రసన్న యూనిట్ మొన్నే ఫస్ట్ లుక్ పోస్టర్ ఒకటి విడుదల చేసింది. ఇక మరో ఆసక్తికరమైన సంగతి కూడా ఇప్పుడు బయటికి వచ్చింది. ఇందులో కేవలం మూడే మూడు పాత్రలు ఉంటాయట. హీరోగా - విలన్ గా మోహన్ బాబు డ్యూయల్ రోల్ చేస్తుండగా, టీనేజ్ లో కనిపించే మోహన్ బాబు పాత్రను మంచు విష్ణు పోషిస్తున్నట్టు తెలిసింది. శ్రేయ విష్ణుకి జోడిగా కనిపిస్తుంది కాని కొద్దిసేపు మాత్రమేనట. తండ్రి కూతుళ్ళ అనుబంధాన్ని హై లైట్ చేస్తూ డైమండ్ రత్నబాబు అందించిన స్క్రిప్ట్ కి పరుచూరి గోపాలకృష్ణ మెరుగులు దిద్ది ఫైనల్ గా ఇది సెట్స్ పైకి తీసుకెళ్ళినట్టు తెలిసింది.

పెళ్ళైన కొత్తలో సినిమాతో ప్రేక్షకులతో మంచి మార్కులు వేయించుకున్న దర్శకుడు మదన్ ఆ తరువాత చేసినవి ఏవి అంతగా ఫలితాన్ని ఇవ్వలేదు. అందుకే మోహన్ బాబు తో పాటు తనకు కూడా కం బ్యాక్ మూవీ కావాలనే కసితో ఇది చేస్తున్నట్టు తెలిసింది. ఒక తండ్రి, ఒక కూతురు ఒక విలన్. ఈ మూడు పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది అని వార్త. చాలా ఏళ్ళ క్రితం వచ్చిన సర్ప యాగం - ఎం ధర్మరాజు ఎంఎ ఛాయలు ఇందులో ఉంటాయని టాక్. మరి ఇంత కాలం తర్వాత మేకప్ వేసుకున్న మోహన్ బాబు కేవలం మూడు పాత్రలు ఉన్న సినిమాతో వస్తే తనకు సపోర్ట్ గా నిలిచే మాస్ ప్రేక్షకులు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు అనేది వేచి చూడాలి. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీని మోహన్ బాబు తన మనవరాళ్ళ పేర్లను జత చేసి లక్ష్మి ప్రసన్న బ్యానర్ పై నిర్మిస్తున్నారు. 
Tags:    

Similar News