యూఎస్ఏలో ఊపేస్తున్న 'ఊ అంటావా మావా'..!

Update: 2022-05-28 04:32 GMT
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన 'పుష్ప: ది రైజ్' సినిమా వచ్చి ఐదు నెలల దాటిపోయినా ఇంకా 'పుష్ప' ఫీవర్ తగ్గడం లేదు. పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించిన ఈ యాక్షన్ డ్రామాలో 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా' పాట ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత తన కెరీర్ లో తొలిసారిగా చేసిన ఈ ఐటమ్ సాంగ్.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇందులో ట్యూన్ కు తగ్గట్టుగా సామ్ వేసిన స్టెప్పులు.. పొట్టి పొట్టి దుస్తుల్లో ఆమె గ్లామర్ షో సోషల్ మీడియాను షేక్ చేశాయి. చిన్న పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ పాటకు కనెక్ట్ అయ్యారు.

సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకూ అందరూ ఊ అంటావా పాటకు ఊగిపోయారు. దీనికి సంబంధించిన రీల్స్ - సరదా పేరడీ సాంగ్స్ నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. విదేశాల్లోనూ ఈ పాట ఓ ఊపు ఊపింది. తాజాగా యూఎస్ఏలో ఓ 13 ఏళ్ల చిన్నారి వయోలిన్ వాయిస్తూ 'ఊ అంటావా.. ఊహు అంటావా' అంటూ కాలిఫోర్నియా వీధుల్లో సందడి చేసింది.

కరోలినా ప్రొట్సెంకో అనే అమ్మాయి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ స్వరపరిచిన ఈ స్పెషల్ సాంగ్ కు అద్భుతమైన వయోలిన్ కవర్ సాంగ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అంతకుముందు ఈ బాలిక చేసిన 'శ్రీవల్లి' వయోలిన్ వెర్సన్ కూడా నెట్టింట సందడి చేసింది. కరోలినా 'ఊ అంటావా'  'శ్రీవల్లి' పాటలకు చేసిన వయోలిన్ వెర్షన్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

ఎక్కడో కాలిఫోర్నియాలో ఉన్న ఈ అమ్మాయి.. 'పుష్ప' పాటలను ప్లే చేస్తోందంటే ఈ సినిమా క్రేజ్ హద్దులు దాటిందని చెప్పాలి. నిజానికి ఈ సినిమాలోని సాంగ్స్ తో పాటుగా పుష్పరాజ్ గా బన్నీ మ్యానరిజం.. డైలాగ్స్ మరియు సింపుల్ స్టెప్పులు దేశ విదేశాలలోని అనేక మందిని ఆకర్షించాయి. 'తగ్గేదే లే' అంటూ సెలబ్రెటీలు క్రికెటర్లు.. వాళ్లు వీళ్లు.. అని తేడా లేకుండా హంగామా సృష్టించారు.

ఈ నేపథ్యంలో ఇప్పుడు 'పుష్ప: ది రైజ్' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ ఈ మూవీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్ళనున్నారు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న 'పుష్ప 2' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.


Full View
Tags:    

Similar News