ఈ మధ్యన కింగ్ నాగార్జున ఏ సినిమాను ఒప్పుకున్నా కూడా కొత్తదనం ఉండేలా చూసుకుంటున్నారు. మనం సినిమా తరువాత సోగ్గాడే చిన్ని నాయనా.. ఇప్పుడేమో ''ఊపిరి'' సినిమా. ఈ సినిమా టీజర్ చాలా కొత్తగా ఉంది.
కాళ్ళు చచ్చుబడిపోయిన ఒక ధనవంతుడు (నాగ్) పారిస్ లో కొత్తగా ఒక అసిస్టెంట్ (కార్తి)ను పెట్టుకుంటాడు. అక్కడే తమన్నా కూడా పని చేస్తూ ఉంటుంది. వీరి మద్యన జరిగే ఆ ఫ్రెండ్ షిప్ కమ్ లవ్ ట్రాక్ ఇక సినిమా అంతా. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో రూపొందుతున్న ఈ ఊపిరిలో ఆద్యంతం కొత్తదనం కొట్టొస్తోంది. అంతేకాదు.. విజువల్స్ రిచ్ గా ఉండటం.. అలాగే కెమిస్ర్టీ బాగా వర్కవుట్ అవ్వడం.. సినిమాకు అన్ని విధాలుగా ప్లస్సులే. ఒక ప్రక్కన మిలియనీర్ గా నాగ్ చితక్కొట్టేస్తే.. పక్కా మాస్ గా కార్తి ఇరగదీశాడు. తమన్నా చాలా క్యూట్ గా ఉంది.
త్వరలో విడుదల కానున్న ఈ సినిమాను పివిపి సినిమాస్ రూపొందిస్తోంది.
Full View