కింగ్ నాగార్జున- నాగచైతన్య కథానాయకులుగా నటించిన `బంగార్రాజు` సంక్రాంతి బరిలో విడుదలైన ఏకైక పెద్ద సినిమా. పోటీబరిలో చిన్న సినిమాలు ఉన్నా బంగార్రాజుపైనే అందరి ఫోకస్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేయనుందో చూడాలన్న ఆసక్తి ట్రేడ్ లో నెలకొనగా తాజాగా ఈ సినిమా మొదటి రోజు వసూళ్ల వివరాలు వెల్లడయ్యాయి.
కింగ్ నాగార్జున.. నాగచైతన్య కెరీర్ బెస్ట్ ప్రీరిలీజ్ బిజినెస్ తో బంగార్రాజు అదరగొట్టిందని తెలిసింది. వరల్డ్ వైడ్ ప్రీరిలీజ్ బిజినెస్ 39 కోట్ల రేంజులో పలికిందని తెలిసంది. 45-50 కోట్ల మేర నెట్ వసూలు చేయాల్సి ఉండగా.. ఈ సినిమా మొదటి రోజు 17కోట్లు పైగా వసూళ్లను సాగించిందని బంగార్రాజు టీమ్ ప్రకటించింది. పండగ బ్లాక్ బస్టర్ అంటూ చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. పండగ రేస్ నుంచి పాన్ ఇండియన్ సినిమాలు ఆర్.ఆర్.ఆర్- రాధేశ్యామ్ వైదొలగడం బంగార్రాజుకు పెద్ద ప్లస్ అయ్యింది. ఇతర మీడియం బడ్జెట్ సినిమాలు విడుదలైనా కానీ అవి కింగ్ కి పోటీ కానేకాదు. బంగార్రాజు వరల్డ్ వైడ్ ప్రీ-రిలీజ్ బిజినెస్ 45 కోట్లు తిరిగి తేవాలంటే ఈ చిత్రం తొలి వారం ఇదే జోష్ తో వసూళ్లను తేవాల్సి ఉంటుంది. నాగ్- చైతన్య కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ డే వసూళ్లు దక్కాయి. తొలి వీకెండ్ ఇదే జోష్ కనబరుస్తుందనే భావిస్తున్నారు.
ఓవైపు దేశవ్యాప్తంగా ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ అసాధారణంగా కేసులు నమోదవుతున్నాయి. ఇంతవరకూ పెరుగుతున్న కోవిడ్ కేసుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో 50శాతం సీటింగ్ నియమం విధించారు. మరోవైపు టికెట్ ధరల్ని పెంచుకునేందుకు ఏపీలో వెసులుబాటు లేకపోవడం పెద్ద మైనస్ గా మారింది. పోటీలో ఎన్ని సినిమాలు ఉన్నా బంగార్రాజుపైనే సంక్రాంతి అల్లుళ్ల దృష్టి నిలుస్తుందన్న అంచనా ఉంది. ఏపీలో టికెట్ ధరలు తన సినిమాని ప్రభావితం చేయవని నాగార్జున కాన్ఫిడెన్స్ ని వ్యక్తం చేశారు. తక్కువ ధరలు ఉన్నా కానీ సేఫ్ జోన్ కి చేరతామనే ధీమాను కనబరిచారు. నాగ్ భావించినట్టు బంగార్రాజు సేఫ్ జోన్ కి చేరుకుంటుందనే ఆశిద్దాం.