ట్రైలర్ టాక్: బివేర్ ఆఫ్ పబ్లిక్

Update: 2018-10-29 09:46 GMT
సీనియర్ హీరో శ్రీకాంత్ చాలా రోజుల తర్వాత సోలో హీరోగా 'ఆపరేషన్ 2019' అనే సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర తన లక్కు ను టెస్ట్ చేసుకునేందుకు వస్తున్నాడు. ఈ సినిమాకు ట్యాగ్ లైన్ 'బివేర్ ఆఫ్ ది పబ్లిక్'.   ఆపరేషన్ అనే పదం టైటిల్ లో చూడగానే తెలుగు ప్రేక్షకులకు శ్రీకాంత్ కెరీర్ లో మంచి విజయం సాధించిన 'ఆపరేషన్ దుర్యోధన' గుర్తుకు వస్తుంది. ఇప్పుడు మరోసారి అలాంటి పవర్ఫుల్ పాత్రతోనే మనముందుకు వస్తున్నాడు.

ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయింది.  ట్రైలర్ ప్రారంభంలోనే "గాంధీ కడుపున గాంధీ పుట్టడు.. ఎన్టీఆర్ కడుపున ఎన్టీఆర్ పుట్టడు.. చిరంజీవి కడుపున చిరంజీవి పుట్టడు.. ఎవరైనా ప్రజల్లో నుంచి పుట్టుకురావలసిందే" అంటూ ఓ సీరియస్ డైలాగ్ చెప్తాడు.  ట్రైలర్ లో కొన్ని షాట్స్ లో శ్రీకాంత్ ను పవర్ఫుల్ గా చూపించే ప్రయత్నం జరిగింది.   కూర్చొని ఉన్న శ్రీకాంత్ తన చెప్పుని కావాలని కింద పడేస్తాడు.. పోలీస్ ఆఫీసర్ దాన్ని తీసివ్వబోతే లాగి పెట్టి చెంప పగలగొడతాడు.  ఇంకో షాట్ లో కూడా మరొకరిని కొడతాడు.

ఓవరాల్ గా చూస్తే 'ఆపరేషన్ 2019' అని టైటిల్ ఉంది గానీ పొరపాటున 2009 లో రావాల్సిన సినిమాను ఇప్పుడు ఈ సోషల్ మీడియా జనరేషన్ లోకి తీసుకొచ్చారా అనిపిస్తోంది. ఈ జెనరేషన్ ఆడియన్స్ ను ఆకట్టుకునే అంశమేమీ లేకుండా ట్రైలర్ ను కట్ చేయడం ఓ ప్రత్యేకత.

దీక్షా పంత్ ఈ సినిమాలో  హీరోయిన్. ఈ సినిమాకు దర్శకుడు కారణం బాబ్జీ.  అలివేలమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అలివేలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  ట్రైలర్ టాక్ అయింది కాబట్టి మీరు కూడా చూసి ఆనందించండి.

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View

Tags:    

Similar News