ఎవ‌రీ అంద‌గాడు? హీరోల డాట‌ర్స్ తో ఈ గేమ్సేంటి?

Update: 2022-11-27 10:40 GMT
ఎవ‌రీ అంద‌గాడు.. వ‌ల‌పుల మాయ‌గాడు? మ‌గువ‌ల గుండెల్లో రాకుమారుడు?  మ‌తులు చెడ‌గొడుతున్నాడు. అత‌డి స్టైల్.. మెయింటెనెన్స్ వ‌గైరా వ‌గైరా ఎప్పుడూ హై క్లాస్ .. అత‌డితో పార్టీ కావాలంటే కేవ‌లం స్టార్ హీరోల కుమార్తెలకు మాత్ర‌మే!! అంత‌గా పాపుల‌ర్ అయిన అతగాడు ఎవ‌రై ఉంటారు?  ప్ర‌స్తుతం ముంబై ఫిలింస‌ర్కిల్స్ కి బాగా తెలిసిన అత‌డి గురించి ఇత‌ర ఫిలింసిటీల్లో  ఫిలింస‌ర్కిల్స్ లోను తెలుసుకోవాల‌నే త‌హ‌తహ కుదిపేస్తోంది.

అత‌డంటే పడి చ‌చ్చే యువ‌న‌టీమ‌నుల‌లో జాన్వీ క‌పూర్.. ఖుషీ క‌పూర్...నైసా దేవ‌గ‌న్.. సన‌యా క‌పూర్.. అన‌న్య పాండే .. సారా అలీఖాన్.. ఇలా అంద‌రూ న‌ట‌వార‌సురాళ్లే. అత‌డు ఎప్పుడూ స‌ద‌రు యంగ్ బ్యూటీస్ తో నైట్ పార్టీల్లో చిలౌట్ చేస్తుంటాడు. వారితో ఎంతో చ‌నువుగా ఉంటాడు. స‌ర‌దాల్లో మునిగి తేల్తాడు. అయితే అత‌డు అంత పెద్ద బిగ్ షాట్ కాక‌పోతే ఈ అవ‌కాశం ఉంటుందా? అంటూ ఇప్పుడు ఊరూ వాడా ఒక‌టే గుస‌గుస‌. ఇంత‌కీ ఎవ‌రా అల్ల‌రి గేమ్ ప్లేయ‌ర్.. చిలిపి టీమ్ ప్లేయ‌ర్? అంటూ ఆరాలు కొన‌సాగుతున్నాయి.

అత‌డి పేరు ఓర్హాన్ అవత్రమణి. ఒర్రీ అని ముద్దుగా పిలుచుకుంటారు. చూడ‌గానే ఏ పాప్ ఆల్బ‌మ్ లోనో న‌టించే పాప్ గాయ‌కుడిలా అత‌డు ఎంతో స్టైలిష్ గా క‌వ్వింత‌గా క‌నిపిస్తాడు. అందుకే అత‌డంటే యువ‌నాయిక‌లు ప‌డి చ‌స్తుంటారు. ఎంతో స్నేహంగా ఉంటారు. ఇక ఈ స్నేహాలు వ‌గైరా ఇక్క‌డ మామూలే కానీ ఎవ‌రైనా స్టార్ డాట‌ర్ అత‌డితో ప్రేమ‌లో ఉన్నారా? అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా బ‌య‌ట‌కు రాలేదు. అత‌డితో అక్కా చెల్లెళ్లు జాన్వీ క‌పూర్- ఖుషీ క‌పూర్ ఒక‌రికి తెలియ‌కుండా ఒక‌రు డేటింగులు చేశార‌ని ఇటీవ‌ల బాలీవుడ్ మీడియాలో క‌థ‌నాలొచ్చాయి. అక్క బోయ్ ఫ్రెండ్ నే ప్రేమించిందంటూ ఖుషీ క‌పూర్ పై క‌థ‌నాలు సంచ‌ల‌న‌మ‌య్యాయి. అయినా వాటిని వారంతా లైట్ తీస్కున్నారు.

నిజానికి సైఫ్ ఖాన్ వార‌సురాలు సారా అలీఖాన్ కి ఒర్రీ క్లాస్ మేట్. ఆ ఇద్ద‌రూ క‌లిసే గ్రాడ్యుయేష‌న్ కూడా పూర్తి చేసారు. ఇక ఒర్రీ ఇంత‌కుముందు జాక్విలిన్ ఫెర్నాండెజ్ స‌హా క‌రీనా క‌పూర్- భూమి ఫెడ్నేక‌ర్ స‌హా ఇత‌ర సీనియ‌ర్ సెల‌బ్రిటీల‌తోను పార్టీల్లో క‌నిపించాడు.

ఇప్పుడు అవ్ర‌త‌మ‌ణి స్టార్ హీరో అజ‌య్ దేవ‌గ‌న్ కుమార్తె నైసా దేవగన్ తో క‌లిసి పార్టీలు షికార్లు చేయ‌డం చ‌ర్చ‌గా మారింది. అయితే ఈ పార్టీ నుంచి ఓ ఫోటో బ‌య‌ట‌కు రాగానే.. ఒర్రీ మాజీ ప్రియురాలు జాన్వీ కపూర్ `మిస్ యు బేబీ` అని వ్యాఖ్యానించి షాకిచ్చింది. నైసా దేవగన్ - ఓర్హాన్ అవత్రమణి ఇటీవల కలిసి జంట‌గా చ‌నువుగా ఉన్న‌ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ పోస్ట్ పై జాన్వీ కపూర్ చేసిన వ్యాఖ్య అందరి దృష్టిని ఆకర్షించింది.

అజయ్ దేవగన్- కాజోల్ ల కూతురు నైసా దేవగన్ ఇటీవ‌ల‌ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. స్టార్ కిడ్ తరచుగా తన స్నేహితుల బృందంతో పార్టీలు చేసుకుంటూ మీడియా కంట ప‌డుతోంది. ఈ పార్టీల బృందంలో జాన్వీ కపూర్ ప్రియుడు ఓర్హాన్ అవత్రమణి అకా ఓర్రీ ప్ర‌తిసారీ క‌నిపిస్తూనే ఉన్నాడు. ఆసక్తికరంగా, ఓర్రీ ఇటీవల తన ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్‌లో థాంక్స్ గివింగ్ పార్టీ నుండి తన బెస్టీ నైసాతో క‌లిసి ఉన్న కొన్ని ఫోటోల‌ను షేర్ చేసాడు.

ORRY ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఇంత‌లోనే సంచ‌ల‌నంగా మారింది. ఈ పోస్ట్ కి "TttHhe OoNnlyYy aaTTtiTtuDde iiS ggRraTtiiTuDdE" అని అతడు కోడ్ లాంగ్వేజ్ లో శీర్షిక పెట్టడం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఇక ఈ ఫోటోల్లో గాళ్స్ అంతా సాధారణ దుస్తులలో క‌నిపించ‌గా.. ఓర్రీ నల్లటి హూడీ - ట్రాక్ ప్యాంట్ లో అందంగా కనిపించాడు. అలాగే స్టార్ డాట‌ర్ నైసా దేవగన్ రెడ్ టాప్ - బ్లూ డెనిమ్ జీన్స్‌తో క‌ళ్ల‌న్నీ త‌న‌వైపున‌కు తిప్పేసుకుంది.

ఓర్రీ పోస్ట్ పై జాన్వీ కపూర్ వ్యాఖ్య
ముఖ్యంగా ఓర్హాన్ అవత్రమణితో డేటింగ్ చేస్తున్న జాన్వీ కపూర్ అతని పోస్ట్ పై స్పందించి పరోక్షంగా అతనిపై తన ప్రేమను వ్యక్తం చేసింది. ఆమె పార్టీని మిస్స‌యినందున ``మిస్ యు బేబీ`` అని కాస్త బాధ‌ను వ్య‌క్తం చేసింది. నిజానికి జాన్వీ వ్యాఖ్య అభిమానులను గందరగోళానికి గురిచేసింది. జాన్వీ వ్యాఖ్యలకు వ్యాఖ్యల విభాగంలో అభిమానులు వెంట‌నే ప్రత్యుత్తరం ఇచ్చారు. ఒక వినియోగదారు ఇలా వ్రాశాడు, "@జాన్వికపూర్ ఓ ఇంత‌కీ మీ బేబీ ఓరీ?" అని సందేహం వ్య‌క్తం చేయ‌గా.... మరో నెటిజన్ “బిఎఫ్ హై భాయ్ ఇస్కా" అని వ్యాఖ్యానించారు.

ఓర్హాన్ అవత్రమణి -జాన్వీ కపూర్ గురించి మాట్లాడాలంటే ఈ ఇద్దరూ తరచుగా ముంబై నగరంలో షికార్లు చేస్తూ క‌నిపిస్తుంటారు. కలిసి కాలక్షేపం చేయ‌డం వెకేష‌న్ల‌కు వెళ్ల‌డం వీళ్ల అలవాటు. అంతకుముందు ఓర్రీతో బంధం గురించి జాన్వీని ప్ర‌శ్నించ‌గా.. అతనితో తన సంబంధాన్ని అంగీకరించలేదు లేదా తిరస్కరించలేదు.   అతను తనకు చాలా సన్నిహితుడు హితుడు స్నేహితుడని మాత్ర‌మే చెప్పింది.

నైసా దేవగన్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. పార్టీ క్రౌడ్ లో నిరంత‌రం క‌నిపించే బ్యూటీగా త‌న‌కు మంచి గుర్తింపు ఉంది. చాలాసార్లు అజయ్ దేవగన్ - కాజోల్ కుమార్తె నైసా త‌న స్నేహితుల‌తో పార్టీల్లో క‌నిపించింది. ఇందులో అవ్ర‌త‌మ‌ణి మ‌స్ట్ గా క‌నిపిస్తాడు. సారా అలీ ఖాన్- అనన్య పాండే- జాన్వీ కపూర్- ఆర్యన్ ఖాన్- ఇబ్రహీం అలీ ఖాన్ స‌హా ఇతర స్టార్ కిడ్స్ తో బలమైన స్నేహాన్ని నైసా కొన‌సాగిస్తోంది. త‌న క‌ద‌లిక‌ల‌ను బ‌ట్టి త్వరలో బాలీవుడ్‌లో అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉందా లేదా అనేది తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. కానీ కాజోల్ కానీ దేవ‌గ‌న్ కానీ దీనిపై అధికారికంగా ఏదీ ప్ర‌క‌టించ‌లేదు. ఇక ఒర్రీ ప్ర‌ముఖ బిజినెస్ మేన్ కుమారుడ‌ని అందుకే అత‌డికి సెల‌బ్రిటీ స‌ర్కిల్స్ లో అసాధార‌ణ క్రేజ్ ఉంద‌న్న గుస‌గుస‌లు కూడా వినిపించాయి.
Tags:    

Similar News