వీడియో : 'జై భీమ్' ను ఇలా గౌరవించిన ఆస్కార్‌

Update: 2022-01-18 10:30 GMT
సూర్య హీరోగా నటించిన జై భీమ్ సినిమాకు ఎన్నో గౌరవ పురష్కారాలు దక్కాయి. అమెజాన్ ప్రైమ్‌ ద్వారా డైరెక్ట్‌ స్ట్రీమింగ్‌ అయిన ఈ సినిమా ఆస్కార్‌ అవార్డ్ బరిలో నిలువడం ఖాయం అంటూ ప్రతి ఒక్కరు చాలా నమ్మకం వ్యక్తం చేశారు. జై భీమ్‌ సినిమా ఒక సామాజిక సమస్య పై తెరకెక్కించిన సినిమా.. కనుక విమర్శకుల ప్రశంసలు ఈ సినిమాకు దక్కాయి. ఇదే సమయంలో తమ వర్గం వారిని అవమానించేలా ఈ సినిమా ఉంటుంటూ విమర్శించిన వారు కూడా ఉన్నారు. జై భీమ్ సినిమా వివాదం పూర్తి అవుతుందని భావిస్తున్న సమయంలో సూర్య పై కొందరు ఫిర్యాదు చేయడం కేసు నమోదు అవ్వడం మొత్తం నెల నెలన్నర రోజుల పాటు హడావుడి సాగింది. ఇప్పుడు హడావుడి తగ్గింది అనుకుంటున్న సమయంలో మళ్లీ జై భీమ్ వార్తల్లోకి వచ్చాడు.

జై భీమ్‌ సినిమా కు ఆస్కార్‌ టీమ్ అరుదైన గౌరవంను ఇచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా రూపొందిన అన్ని అద్బుత సినిమాలకు అవార్డులను ఇవ్వడం సాధ్యం అయ్యే పని కాదు. అందుకే అత్యాధునిక టెక్నాలజీని వాడిన సినిమాలను మరియు అద్బుతమైన కథ మరియు సన్నివేశాలు ఉన్న సినిమాలకు తమ ఆస్కార్‌ యూట్యూబ్‌ ఛానల్ లో స్థానం కల్పిస్తారు. పది నుండి ఇరవై నిమిషాల వరకు సన్నివేశాలను ఆ యూట్యూబ్‌ ఛానల్‌ లో పోస్ట్‌ చేస్తు ఉంటారు. అలా పోస్ట్‌ చేయడం చాలా గౌరవంగా భావిస్తూ ఉంటారు. ఆస్కార్‌ అఫిషియల్‌ యూట్యూబ్‌ ఛానల్‌ లో ఇప్పుడు మన సూర్య నటించిన జై భీమ్ కు దక్కింది. జై భీమ్‌ సినిమాలోని 12 నిమిషాల నిడివి సన్నివేశాలను ఆస్కార్‌ యూట్యూబ్‌ లో షేర్‌ చేసింది.

జైలు వద్ద ఖైదీలను కులాల వారిగా విభజించి కొందరిని బయటకు కొందరిని లోనికి తీసుకు వెళ్లే సన్నివేశంతో పాటు సినతల్లి భర్త పామును పట్టడం.. తద్వార దొంగతనంను అతడి మీద వేయడం.. చివర్లో కోర్టులో లాయర్ గా సూర్య వాదించిన సన్నివేశాలు.. కేసు గెలిచిన సన్నివేశాలను చూపించడం జరిగింది. మొత్తం 12 నిమిషాల నిడివి సన్నివేశాలతో సినిమా కథ మొత్తం రివీల్ చేశారు. సినిమాలోని అత్యంత కీలక సన్నివేశాలను ఇలా ఆస్కార్‌ యూట్యూబ్‌ ఛానల్‌ లో షేర్‌ చేయడం అంటే అవార్డు వచ్చినంత గౌరవం అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సూర్య నటనకు లేదా కథ స్క్రీన్ ప్లే లేదా బెస్ట్‌ చిత్రంగా అయినా ఆస్కార్ అవార్డు జై భీమ్ కు వస్తే గౌరవం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Full View

Tags:    

Similar News