యాత్రపై ఫ్లాప్‌ సినిమాల ఎఫెక్ట్‌

Update: 2019-02-03 01:30 GMT
మహానటి సినిమాతో టాలీవుడ్‌ లో బయోపిక్‌ ల సీజన్‌ మొదలైంది. మహానటి ఏ టైమ్‌ లో హిట్‌ అయ్యిందో కానీ అప్పటినుంచి ప్రతీ ఒక్కరూ బయోపిక్‌ లు తీసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి బయోపిక్‌ ని  మొదలుపెట్టాడు మహి వి రాఘవ్‌. మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టీ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 8న రిలీజ్‌ కాబోతుంది.

యాత్ర సినిమా ట్రైలర్‌ బాగా వచ్చింది. అన్నింటికి మించి వైఎస్ పాత్రలో మమ్ముట్టీ పర్‌ ఫెక్ట్‌ గా సెట్‌ అయ్యాడు. అంతా బాగానే ఉంది కానీ.. ఈ సినిమా మార్కెట్‌ మాత్రం ఆశించిన స్థాయిలో జరగడం లేదట. దీనికి కారణం.. సంక్రాంతికి వచ్చి అట్టర్‌ ఫ్లాప్ అయినా సినిమాలే. ఎన్టీఆర్‌ కథానాయకుడు.. డిస్ట్రిబ్యూటర్లను - బయ్యర్లను దాదాపు ముంచేసింది. ఆ తర్వాత వచ్చిన వినయ విధేయ రామకు ఓ మాదిరి కలెక్షన్లు వచ్చినా.. లాస్‌ తప్పలేదు. దీంతో.. ఇప్పుడు మళ్లీ మరో పెద్ద సినిమాపై పెట్టుబడి పెట్టేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు.

యాత్ర శాటిలైట్‌ మార్కెట్‌ బాగానే జరిగింది. కానీ థియేట్రికల్‌ రైట్స్‌ బిజినెస్ మాత్రం ఎక్స్‌ పెక్ట్‌ చేసిన రేంజ్‌ లో జరగలేదు. బడ్జెట్‌ మొత్తం ఆర్టిస్టుల  రెమ్యూనరేషన్‌ కే సరిపోయింది. దీంతో.. థియేట్రికల్‌ రైట్స్‌ ద్వారా వచ్చే డబ్బులే నిర్మాతలకు లాభం. అయితే.. సినిమా రిలీజ్‌ కి  ఇంకా టైమ్ ఉంది కాబట్టి.. ఈలోపుగా మార్కెట్‌ అవుతుందని నిర్మాతలు ఆశిస్తున్నారు.
Tags:    

Similar News