ఇక్కడ ఫేమస్.. కాని తెలుగోళ్లు కాదు

Update: 2017-07-10 17:30 GMT
సినిమా రంగం అంటే రకరకాల ట్యాలెంట్స్ ఉన్నవారు.. పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఉంటారు. అసలు నటనా రంగంలోనే ఈ వైవిధ్యం కనిపిస్తుంది. టాలీవుడ్ లో ఈ వైవిధ్యత మరీ ఎక్కువగా ఉంటుంది. అయితే.. కొంతమంది నటులు అసలు తెలుగు వారే కాకపోయినా.. ఇక్కడ బోలెడంత క్రేజ్ సంపాదించేసి.. అచ్చ తెలుగులో మాట్లాడేసే పలువురు నటులు అసలు తెలుగోళ్లే కాదంటే ఆశ్చర్యం వేయక మానదు.

గత తరంలో సావిత్రి తరువాత జమున అంతటి ప్రఖ్యాతి గడించారు. అయితే.. ఈమె తెలుగు వ్యక్తి కాదు. పుట్టుకతో కన్నడ వ్యక్తి జమున. కేరక్టర్ ఆర్టిస్ట్ సుధ ఇప్పుడు అమ్మ పాత్రలతో మెప్పిస్తుంటారు. ఆమె ఒక తమిళియన్ అనే సంగతి చాలా తక్కువ మంది తెలుసు. తెలుగులో అనర్గళంగా మాట్లాడేసే యాంకర్ సుమ మలయాళీ అనే సంగతి తెలిసిందే. హీరోయిన్ ఛార్మి కౌర్ తెలుగులో చక్కగా మాట్లాడుతున్నా.. ఆమె సినిమాల కోసమే ముంబై నుంచి హైద్రాబాద్ వచ్చి సెటిల్ అయింది. ప్రకాష్ రాజ్.. పవిత్రా లోకేష్ వంటి నటులు కూడా కన్నడ వ్యక్తులే.

హీరో రాజా తమిళనాడు వాసి అయినా.. వైజాగ్ లో విద్యాభ్యాసం కారణంగా తెలుగులో చక్కగా మాట్లాడగలడు. ఇప్పుడు అమ్మ పాత్రలలో మెరుస్తున్న ప్రగతి కూడా చైన్నై నుంచి వచ్చి ఇక్కడే సెటిల్ అయింది. అయితే.. ఆమె హైద్రాబాద్ లోనే పుట్టి పెరిగిన వ్యక్తి కావడంతో.. తెలుగులో ఎంచక్కా మాట్లాడేస్తుంది. ప్రగతి.. రాజాలను మినహాయిస్తే.. మిగిలిన వారెవరూ తొలి తెలుగు సినిమాలో నటించే వరకూ అసలు ఒక్క ముక్క కూడా వీరికెవరికీ తెలుగు భాష రాదు. అయినా.. ఇప్పుడు ఎంతలా మెప్పిస్తున్నారో చూస్తున్నాం కదా. తెలుగు నేర్చుకుని మరీ తెలుగు ఇండస్ర్టీలో ఫేమస్ అయిపోయారు.
Tags:    

Similar News