టాలీవుడ్లో టాప్ లో ఉన్న హీరోయినే.. తమిళ్ హీరోలతోనూ రొమాన్స్ చేస్తుంది.. మలయాళంలోనూ పెర్ఫామ్ చేస్తుంది. హీరోయిన్స్ కి ఇదో పెద్ద అడ్వాంటేజ్. బోర్డర్స్ దాటేసి అందరూ అన్ని భాషల్లో నటించేస్తారు. కానీ మిగిలిన ఆర్టిస్ట్ లకి ఈ రూల్ వర్తించేది కాదు. ఎవరైనా ప్రయత్నించినా అవకాశాలిచ్చి ఎంకరేజ్ చేసే వాళ్లుండరు. కానీ కొత్త దర్శకులు యంగ్ హీరోస్ థింక్ డిఫరెంట్ అంటున్నారు. పరభాష నటుల్ని మన సినిమాల్లో చూపిస్తున్నారు. ఇతర భాషల హీరోలు కూడా మన ఆర్టిస్ట్ లకి ఆఫర్స్ ఇస్తున్నారు.
జనతా గ్యారేజ్ సినిమా మీద హైప్ రావడానికి మోహన్ లాల్ కూడా ఓ కారణం. నటుడిగా మోహన్ లాల్ ది దేశం గర్వించే స్థాయి. కానీ ఆయన నటనని మనకి చూసే భాగ్యం మనకి లేదు. ఎప్పుడో వచ్చిన కాలాపానీ - యోధ లాంటి చిత్రాలు తప్ప మళ్లీ మోహన్ లాల్ మూవీస్ డబ్ కాలేదు. కానీ మనమంతా.. జనతా గ్యారేజ్ సినిమాలు ఆ లోటు తీర్చేశాయ్. ఇక మీదట మోహన్ లాల్ సినిమాలు కేరళతో పాటు తెలుగులోనూ రిలీజ్ కావడం పక్కా. సూర్య - కార్తీ - విక్రమ్ లాంటి తమిళ్ హీరోల్ని మనం ఎప్పుడో ఓన్ చేసేసుకొన్నాం. వాళ్ల సినిమాలు తమిళ్ తో పాటు ఒక్కోసారి సొంత భాషలో కన్నా తెలుగులోనే ఎక్కువ థియేటర్స్ లో రిలీజై కలెక్షన్స్ కూడా కుమ్మేస్తాయ్. కార్తీ అయితే ఊపిరితో తెలుగులో కూడా అఫిషియల్ గా పరిచయమయ్యాడు. సొంత డబ్బింగ్ కూడా చెప్పుకొంటాడు.
అంతేకాదు మన జూనియర్ ఎన్టీఆర్ వెళ్లి కన్నడలో గెలయా అని పునీత్ రాజ్ కుమార్ కోసం పాట పడాడు. ఆ పాట కన్నడ వాళ్లకి విపరీతంగా నచ్చేసింది. కన్నడ సుదీప్ రాజమౌళి సినిమాల్లో పార్టైపోయాడు. ఇక కన్నడ హీరో శివరాజ్ కుమార్ శివలింగ మూవీ 100 రోజుల ఫంక్షన్ కి బాలక్రిష్ణ వెళితే.. గౌతమీ పుత్ర శాతకర్ణితో తెలుగులో కూడా ఎంట్రీ ఇస్తున్నాడు శివ రాజ్ కుమార్. అలాగే ఇంకో మూవీలోనూ నటించబోతున్నాడు. ధనుష్ - శింబులు మన హీరోల కోసం తెలుగులో పాటలు పాడేస్తున్నారు.
అల్లు అర్జున్ అల్రెడీ కేరళలో స్టార్ హీరో. ఇప్పుడు తమిళ్ లోనూ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక జగపతిబాబు తెలుగులోనే కాదు మిగిలిన సౌత్ లాంగ్వేజెస్ లో కూడా ఇప్పుడు డిమాండ్ ఉన్న స్టైలిష్ విలన్. పులి మురుగన్ తో మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చాడు. భైరవలో విజయ్ కి విలన్ గా నటిస్తున్నాడు. అలాగే మన దగ్గర యంగ్ విలన్స్ గా పాపులరైన చరణ్ దీప్ - వంశీక్రిష్ణ - ప్రభాకర్ లాంటి వాళ్లు ఇతర భాషల్లోనూ అవకాశాలు అందుకుంటున్నారు.
ఇలాంటి కాంబినేషన్స్ సెట్ చేసుకోవడం వెనక మనది కానీ రాష్ట్రాల్లో మార్కెట్ పెంచుకోవాలనే బిజినెస్ స్ట్రాటజీ మూవీ యూనిట్ ది అయితే.. ఆడియెన్స్ మాత్రం ఇతర భాషల్లోని గొప్ప నటుల్ని మన తెర మీద చూసే అవకాశం వచ్చింది అని సంబరపడుతున్నారు. అందుకే మోహన్ లాల్ వచ్చి ఎళ్లరుక్కుమ్ నమస్కారమని మలయాళంలో అన్నా మనం రిసీవ్ చేసుకుంటున్నాం.. జగపతి బాబు వెళ్లి యార్రా నీ అని అదర్ లాంగ్వేజెస్ లో రౌడీయిజం చేస్తే వాళ్లు కూడా రిసీవ్ చేసుకొంటున్నారు. ఇక అనిరుధ్ లాంటి టెక్నిషియన్స్ కైతే మనోళ్లు అళుమా డోలుమా అని ఓ రేంజ్ లో వెల్కమ్ చెప్పారులే.. పవన్ కల్యాణ్ మూవీ గురించి అనౌన్స్ చేయగానే. గోపీసుందర్ - జిబ్రాన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ మన దగ్గర కూడా వాయించేస్తున్నారు.
అయినా ఔట్ పుట్ అదిరిపోవాలే గానీ ఎవరూ ఎక్కడి వాళ్లైతే ఏంటి..? ఫైనల్ గా ఆడియెన్స్ కి కావాల్సింది ఎంటర్టైన్మెంట్.. ఎంటర్టైన్మెంట్.. ఎంటర్టైన్మెంట్.. అంతే!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/