థియేట్రికల్ రిలీజ్ తర్వాతే ఓటిటి: స్టార్ హీరోయిన్ వార్నింగ్

Update: 2021-04-21 08:30 GMT
దేశవ్యాప్తంగా సినీ ఇండస్ట్రీలో రిలీజ్ కావాల్సిన సినిమాలు కరోనా కారణంగా వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. అదే బాటలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటించిన త్రిభాషా చిత్రం 'తలైవి' కూడా వాయిదా పడింది. దివంగత తమిళనాడు సీఎం జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ తో ప్రేక్షకులలో భారీ అంచనాలను క్రియేట్ చేసింది. అదేవిధంగా ఏప్రిల్ 23న రిలీజ్ చేయనున్నట్లు కూడా ప్రకటించింది చిత్రబృందం. కానీ కోవిడ్ వలన సినిమా వాయిదా పడటంతో తలైవి రిలీజ్ పై బాలీవుడ్ వర్గాలలో పుకార్లు వైరల్ అవుతున్నాయి. తలైవి మూవీ త్వరలోనే డైరెక్ట్ ఓటిటిలో రిలీజ్ చేస్తారని పలు కథనాలు చెబుతున్నాయి.

తాజాగా హీరోయిన్ కంగనా తలైవి పుకార్లకు చెక్ పెడుతూ ఫైర్ అయింది. అలాగే సినిమా రిలీజ్ పై కూడా క్లారిటీ ఇచ్చేసింది. సోషల్ మీడియా వేదికగా కంగనా.. "తలైవి డిజిటల్ హక్కులు అమెజాన్(తమిళం), నెట్ ఫ్లిక్స్(హిందీ) ఓటిటిలు దక్కించుకున్నాయి. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కాకుండా ఓ ఓటిటి కూడా ముందే ప్రసారం చేయవు. దయచేసి పుకార్లను ఆపేయండి. ఇకపై తలైవి పై ఫేక్ పుకార్లు క్రియేట్ చేసేవారిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది" అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ తో పాటు క్లారిటీ ఇచ్చింది తలైవి. ఈ సినిమాలో కంగనాతో పాటు అరవింద్ స్వామి కీలకపాత్రలో నటించాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను ఎల్. విజయ్ తెరకెక్కించాడు. ప్రస్తుతం కంగనా వార్నింగ్ నెట్టింట వైరల్ అవుతోంది.
Tags:    

Similar News