లాక్ డౌన్ సమయంలో పెద్ద తెరకు ప్రత్యామ్నాయంగా ఓటీటీ వ్యవ్యస్థ ఎంత కీలక పాత్ర పోషించిందో తెలిసిందే. దాదాపు ఏడాదిన్నరపాట ఓటీటీ -డిజిటల్ వేదికలే ప్రేక్షకులకు వినోదాన్ని అందించాయి. పోటీ లేకపోవడంతో ఓటీటీ - సినిమాలు షోలు ప్రేక్షకుడికి బాగా రీచ్ అయ్యాయి. ఆ కారణంగా ఎన్నో కొత్త ఓటీటీ సంస్థలు అందుబాటులోకి వచ్చాయి. నెట్ ప్లిక్స్..అమెజాన్ ప్రైమ్.. డిస్నీ హాట్ స్టార్ వంటి కార్పోరేట్ దిగ్గజ ఓటీటీలు ప్రేక్షకుల్లో మరింత స్ట్రాంగ్ అయ్యాయి. తెలుగులో ప్రాంతీయంగా ఆహా గొప్ప పురోగతిని సాధించింది. కరోనా సమయంలో ఈ సంస్థలు భారీ ఎత్తున వ్యాపారాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చాయి. కోట్లాదిగా సబ్ స్క్రైబర్లను పెంచుకున్నాయి. ఇప్పుడు సినిమా అంటే ప్రతీ ఒక్కరి నోట ఓటీటీ అనే మాట వస్తుంది.
అంతగా జనాలకు ఓటీటీని అలవాటు చేసారు. సరిగ్గా ఇదే అదునుగా భావించిన సదరు ఓటీటీ సంస్థలు తాజాగా సబ్ స్క్రిప్షన్ ఫీజును పెంచేసాయి. మార్కెట్ లో చాలా ఓటీటీ సంస్థలు ఉన్నా దక్షిణాదిన బాగా పాపులర్ అయిన అమెజాన్ ప్రైమ్..నెట్ ప్లిక్స్.. హాట్ స్టార్..ఆహా ప్లాట్ ఫాంలు ముందుగా ఫీజులు పెంచినట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ సమయంలో ఈ నాలుగు ఓటీటీ ప్లాట్ ఫాంలలో ఓ రేంజ్ లో బిజినెస్ చేసాయి. ఒకదానికి ఒకటి పోటీ పడుతూ సదరు సంస్థలు కొత్త ఆఫర్లు ప్రకటించి వినియోగదారులను భారీగా పెంచుకున్నాయి. ఆఫర్లకు తగ్గట్టు మంచి కంటెట్ ని కూడా అందుబాటులోకి తీసుకు రావడంతో సక్సెసయ్యారు.
ప్రస్తుతం వాటికి మంచి రేటింగ్ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత సన్నివేశాన్ని ఎన్ క్యాష్ చేసుకునేందుకు కొత్త ప్లానింగ్స్ ని సిద్ధం చేస్తున్నాయని తెలుస్తోంది. ఇకపై సబ్ స్క్రిప్షన్లపై టారిఫ్ లు పెరిగినా పెరగొచ్చన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నిత్యావసరాల ధరలు సహా ప్రతిదీ మంట పెడుతున్న క్రమంలో సామాన్యుడికి ఓటీటీ ధరల రూపంలో షాక్ ఉంటుందేమోనని భావిస్తున్నారు. మెగా నిర్మాత అల్లు అరవింద్ నిర్వహిస్తోన్న ఆహా 2.0ని లాంచ్ చేసి అందులో సెలబ్రిటీల ప్రత్యేక ఇంటర్వ్యూలను సైతం చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న ఆ షోకి మంచి ఆదరణ లభిస్తోంది. బాలయ్య ఎంట్రీనే ఈ షోకి ప్రత్యేకమైనే క్రేజ్ ని తీసుకొచ్చింది. ఓటీటీ వ్యవస్థలోనే ఇలాంటి ఇంటర్వ్యూలు చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం.