మెగా మూవీ విషయంలో రాజీకొచ్చిన ఓటీటీ?

Update: 2020-10-30 09:50 GMT
థియేటర్లు ఓపెన్‌ కు సమయం పడుతున్న కారణంగా చాలా సినిమాలను ఓటీటీ ద్వారా విడుదల చేసేందుకు నిర్మాతలు ముందుకు వచ్చారు. పలు సినిమాలు ఓటీటీ ద్వారా విడుదల అయ్యాయి.. మరికొన్ని కూడా ఓటీటీ రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ నటించిన సోలో బ్రతుకే సోబెటర్‌ సినిమాను కూడా ఓటీటీలో విడుదల చేసేందుకు జీ5 సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారట. సినిమాను జీ5 కు అమ్మేసిన తర్వాత థియేటర్ల ఓపెన్‌ కు కేంద్రం నుండి అనుమతి రావడంతో చిత్ర యూనిట్‌ సభ్యులు సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని భావించారు. దాంతో చిత్ర యూనిట్‌ మరియు జీ5 మద్య గత కొన్ని రోజులుగా ఈ విషయమై చర్చ జరుగుతున్నట్లుగా మీడియా సర్కిల్స్‌ ద్వారా సమాచారం అందుతోంది.

హీరో సాయి ధరమ్‌ తేజ్‌ తో పాటు అంతా కూడా సినిమా థియేట్రికల్‌ రిలీజ్ ను కోరుకుంటున్న నేపథ్యంలో స్ట్రీమింగ్‌ రైట్స్‌ ను కొనుగోలు చేసిన జీ5 వారు రాజీకి వచ్చారట. వారే స్వయంగా ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేసేందుకు ఒప్పుకున్నారట. డిసెంబర్‌ మూడవ వారంలో క్రిస్మస్‌ సందర్బంగా థియేటర్లు పూర్తి స్థాయిలో ఓపెన్‌ అయితే విడుదల చేసేందుకు సిద్దంగా ఉన్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులతో చెప్పారట.

డిసెంబర్‌ వరకు కూడా థియేటర్ల విషయంలో స్పష్టత రాకుంటే ఓటీటీ ద్వారానే సినిమాను విడుదల చేసే అవకాశాలు కూడా లేకపోలేదు అంటూ మీడియా సర్కిల్స్‌ లో టాక్‌ వినిపిస్తుంది. మొత్తానికి క్రిస్మస్‌ కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అది కూడా థియేటర్లు పూర్తి స్థాయిలో రన్‌ అయితే అనేది ఇక్కడ కండీషన్‌. ఇప్పటికే ఈ సినిమాకు క్లీన్‌ యూ సెన్సార్‌ సర్టిఫికెట్‌ వచ్చింది. నభా నటేష్‌ హీరోయిన్‌ గా నటించిన ఈ సినిమాకు సుబ్బు దర్శకత్వం వహించాడు.
Tags:    

Similar News