ఉపాధి కల్పిస్తున్నారు..వారి టాలెంట్ వాడుకుంటున్నారు..!

Update: 2020-05-03 23:30 GMT
'ఓటీటీ' అంటే 'ఓవర్‌ ది టాప్‌'... పేరుకు తగ్గట్టుగానే దానిదే ఇప్పుడు పైచేయి అవుతోంది. కరోనా పుణ్యమా అని లాక్‌ డౌన్‌ నేపథ్యంలో జనాలు ఇళ్లకే పరిమితం అయ్యాక వీటికి డిమాండ్ బాగా పెరిగింది. ఈ సమయంలో ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ బాగా పుంజుకున్నాయని చెప్పవచ్చు. ఓటీటీలకు భారీగా సబ్ స్క్రైబర్ల సంఖ్య పెరగడంతో పాటు భారీ వ్యూయర్ షిప్ వస్తోంది. దీనిని బట్టి ప్రెజెంట్ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ హవా నడుస్తోందని చెప్పవచ్చు. పరిస్థితులను బట్టి చూస్తే ఇకపై సినిమాలన్నీ థియేటర్లలో కాకుండా డైరెక్ట్ ఓటీటీలలో రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కరోనా ఎఫెక్ట్ ఎప్పటివరకు కొనసాగుతుందో తెలియని పరిస్థితి.. ఒకవేళ కరోనా కంట్రోలై లాక్ డౌన్ ఎత్తేసినా కూడా జనాలు సినిమా థియేటర్స్‌ ఒకప్పటిలా వచ్చి ఎగబడి సినిమా చూసే పరిస్థితి ఎంతవరకు ఉంటుందో తెలియదు. దీంతో ఇంట్లోనే ఉంటున్న జనాలు ఓటీటీల ను ఆశ్రయిస్తున్నారు.. ఆశ్రయిస్తారు కూడా. ఫ్యూచర్ లో వాటిదే రాజ్యం కాబోతోందని చెప్పవచ్చు.

దీంతో స్టార్ యాక్టర్స్ ని వెబ్ సిరీస్‌ లలో నటింపచేసి వాటికి మరింత క్రేజ్ తేవాలని ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్స్ ప్రయత్నిస్తున్నాయి. దీని కోసం కొంతమంది నటీనటులను టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ముందుగా వీరు బాలీవుడ్ ని ఎంచుకున్నారు. ప్రస్తుతం ఇండియ‌న్ ఓటీటీ కంటెంట్ కు బేస్ గా మారిపోయింది బాలీవుడ్. అయితే ఇప్పుడు కేవ‌లం బాలీవుడ్ నే టార్గెట్ చేయ‌కుండా.. ఇత‌ర సినిమా ఇండ‌స్ట్రీల మీద కూడా త‌మ హ‌వాను పెంచుకోవడానికి ఓటీటీ కార్పోరేట్లు ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. ముఖ్యంగా మన టాలీవుడ్ మీద ఫోకస్ చేసారు. దానిలో భాగంగా ఇక్క‌డ 'లో' ప్రోఫైల్ లేదా వ‌ర‌స ఫ్లాపుల‌తో స‌త‌మ‌వుతున్న హీరో హీరోయిన్లను.. ఫేడ్ అవుట్ స్టేజిలో ఉన్న యాక్టర్స్ ని టార్గెట్ చేసుకుంటున్నారు. వారికి ఉపాధి క‌ల్పిస్తున్నారు.. అలానే మ‌న టాలెంట్ ని బాగానే వాడ‌కుంటున్నారు. తెలుగు నాట కూడా ఇలా వాళ్ల వ్యూయ‌ర్ షిప్ పెంచుకుంటున్నారు. ఇక్క‌డ పాయింట్ ఏంటంటే.. ఈ ఆర్టిస్టులు తెలుగు నిర్మాత‌లు ద‌గ్గ‌ర భారీగా డిమాండ్ చేసే స్టేజ్ ద‌గ్గ‌ర నుంచి ఓటీటీ కార్పోరేట్లు ఎంత ఇస్తే అంత తీసుకునే రేంజ్ కి ప‌డిపోయారు.

వాస్తవానికి ఈ ఆర్టిస్టులు రేంజ్ కి మించి డిమాండ్ చేయడంతో నిర్మాతలు పక్కన పెడుతూ వచ్చారు.. కానీ వారు ఓటీటీల దగ్గర మాత్రం ఎంత ఇస్తే అంత తీసుకొని సర్దుకుపోతున్నారు. అయితే వీరు యాక్ట్ చేసే వెబ్ సిరీస్ లు తెలుగులో కూడా హిట్ టాక్ తెచ్చుకుంటున్న‌ప్ప‌టికీ అందులో యాక్ట్ చేసే నటీనటులకు మాత్రం ఉప‌యోగం ఉండ‌టం లేద‌న్న‌ది వాస్త‌వం. ప్రస్తుతం వెబ్ కంటెంట్ వైపు అడుగులు వేస్తున్న హీరోహీరోయిన్లను చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది. ఆ వెబ్ సిరీసులు మంచి సక్సెస్ అయినా దానిలో యాక్ట్ చేసిన వారికి మాత్రం ఆశించిన స్థాయిలో గుర్తింపు రావడం లేదు. రాబోయే రోజుల్లో ఓటీటీలు పెద్ద పెద్ద స్టార్ యాక్టర్స్ కి గాలం వేయబోతున్నాయి. మరి ముందు ముందు ఓటీటీల వలలో ఎంతమంది హీరోహీరోయిన్లు చిక్కుకుంటారో చూడాలి.
Tags:    

Similar News