కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన పరిస్థితుల వల్ల సినిమా థియేటర్స్ అండ్ మల్టీప్లెక్సెస్ గత ఆరున్నర నెలల నుంచి మూతబడి ఉన్న సంగతి తెలిసిందే. కేంద్రం షూటింగులకు అనుమతులిచ్చినప్పటికీ థియేటర్స్ రీ ఓపెనింగ్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ప్రొడ్యూసర్స్ కి తమ సినిమాలు విడుదల చేసుకోవడానికి డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ మరో మార్గంగా కనిపించాయి. ఈ నేపథ్యంలో గత ఆరు నెలల్లో వివిధ భాషల నుంచి అనేక సినిమాలు నేరుగా ఓటీటీల్లో విడుదలయ్యాయి. మన టాలీవుడ్ నుంచి కూడా ఇప్పుడిప్పుడే క్రేజీ మూవీస్ డిజిటల్ రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో ఓటీటీలు ఆదరణ దక్కించుకుంటూ సబ్స్క్రైబర్స్ ని పెంచుకుంటూ పోతున్నారు. అయితే ఓటీటీ సంస్థలు సినిమాలు కొనుక్కోవడంలో కొన్ని ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా, ఓటీటీలు బహుభాషా చిత్రాలకి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తోంది. ఆ తర్వాత హీరో క్రేజ్ ని బట్టి రెగ్యులర్ సినిమాలని కొనుక్కుంటున్నారట. ఇటీవల అనేక మంది ప్రొడ్యూసర్స్ తమ సినిమాలను డిజిటల్ రిలీజ్ చేయాలని ఓటీటీలను సంప్రదించినప్పటికీ.. ఓటీటీలు మాత్రం మల్టీలింగ్వల్స్ చిత్రాలకే ఓటు వేస్తూ వస్తున్నాయని తెలుస్తోంది. రెగ్యులర్ రీజనల్ ఫిలిమ్స్ కాకుండా రెండు లేదా మూడు భాషల్లో తెరకెక్కిన చిత్రాలను.. ఇతర భాషల్లో క్రేజ్ ఉన్న నటీనటులు యాక్ట్ చేసిన సినిమాలను తీసుకోడానికి ఆసక్తి చూపిస్తున్నారట. మల్టీలింగ్వల్స్ చిత్రాలు అయితే ఒకేసారి ఇతర భాషల ఆడియన్స్ ఆదరణ కూడా దక్కించుకోవచ్చని ప్లాన్స్ చేస్తున్నారట. దీని వల్ల వ్యూయర్ షిప్ పెరగడంతో పాటు సబ్స్క్రిప్షన్స్ కూడా పెరుగుతాయని ఆశిస్తున్నారట. ఈ మధ్య డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ దాదాపుగా బహుభాషా చిత్రాలే అని చెప్పవచ్చు. అందుకే రెగ్యులర్ మూవీస్ తీసే ఫిలిం మేకర్స్ ఇప్పుడు తమ చిత్రాలను ఒకేసారి ఇతర భాషల్లోకి డబ్బింగ్ చేయాలని చూస్తున్నారని సమాచారం.