ఓటీటీలు కూడా అలాంటి పద్ధతిని ఫాలో అయితే బాగుంటుంది..!

Update: 2020-10-25 01:30 GMT
కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల వల్ల సినిమా థియేటర్స్ అండ్ మల్టీప్లెక్సెస్ మూతబడిపోవడంతో ఓటీటీలకు క్రేజ్ పెరిగింది. ఒరిజినల్ మూవీస్ - వెబ్ సిరీస్ లతో పాటు కొత్త సినిమాలను కూడా డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో విడుదల చేస్తున్నారు. భాషతో జోనర్ తో సంబంధం లేకుండా సినిమాలను కొనుగోలు చేసి ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ లో స్ట్రీమింగ్ కి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో గత ఎనిమిది నెలల్లో వివిధ భాషల నుంచి అనేక సినిమాలు నేరుగా ఓటీటీల్లో విడుదలయ్యాయి. టాలీవుడ్ లో కూడా చిన్న మీడియం రేంజ్ సినిమాలు చాలానే డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కి వెళ్లాయి. దీంతో ఇండ‌స్ట్రీలో చిన్న సినిమాల‌కి.. మీడియం రేంజ్ సినిమాల‌కి ఓటీటీలు ఊతం మాదిరిగా ప‌నికొస్తున్నాయని అందరూ అనుకున్నారు. అయితే ఓటీటీలో విడుదలైన ఏ ఒక్క తెలుగు సినిమాకి కూడా పాజిటివ్ టాక్ రాలేదనే కామెంట్స్ వస్తున్నాయి.

తెలుగు నుంచి డైరెక్ట్ ఓటీటీలో విడుదలైన సినిమాల్లో కొన్ని మిశ్రమ స్పందన తెచ్చుకోగా.. మరికొన్ని నెగెటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. మిగ‌తా భాష‌ల్లో ఈ ప‌ద్ధ‌తిలో విడుద‌లైన సినిమాలు చాలా వరకు మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఇక్కడ లోపం ఎక్క‌డ జరుగుతుందని విశ్లేషించిన సినీ ఎక్సపర్ట్స్.. డ‌ల్ కంటెంట్ ఉన్న సినిమాల్ని ఓటీటీలకు రిఫర్ చేస్తున్నవారే దీనికి అస‌లు కార‌ణమని అభిప్రాయపడుతున్నారు. అందులోనూ టీజర్స్ కి వచ్చిన రెస్పాన్స్ ని బట్టి కూడా సినిమాను తీసుకోవడం కూడా ఓ కారణమని అంటున్నారు. అందుకే ఓటీటీ ప్రతినిధులు టీజ‌ర్స్ చూసి సినిమాలు కొన‌డం మానేసి.. ఫ‌స్ట్ కాపీ చూశాకే డీల్ కుదుర్చుకుంటేనే మంచిదని.. ట్రెడిషనల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ని ఇక్కడ కూడా ఫాలో అయితే మంచి కంటెంట్ ని ప్రేక్షకులకు అందించే అవకాశం ఉంటుందని సినీ ఎక్సపర్ట్స్ చెబుతున్నారు. మరి ఓటీటీలు ఇప్పటి నుంచైనా ఆ విధంగా ఆలోచిస్తారేమో చూడాలి.
Tags:    

Similar News