ఒక సాధారణ డ్రైవర్ కొడుకు యశ్ కన్నడ సినీపరిశ్రమలో తాజా సెన్సేషన్ అన్న సంగతి తెలిసిందే. ఒకే ఒక్క కేజీఎఫ్ చిత్రం అతడి ఫేట్ ని మార్చేసింది. దక్షిణాదిన పెద్ద స్టార్ గా అవతరించాడు. కేజీఎఫ్ చాప్టర్ 1 గ్రాండ్ సక్సెస్ నేపథ్యంలో సీక్వెల్ కోసం దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎంతో శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి కేజీఎఫ్- 1 ను మించి అసాధారణ కాన్వాసును ఎంచుకుని సినిమా తీస్తున్నారు.
పార్ట్ 2 కోసం భారీ కాస్టింగ్ ని ఎంపిక చేసుకున్నారు. ఇటీవలే సినిమాని ప్రారంభించారు. ఇటీవలే యశ్ షూటింగులో జాయిన్ అయ్యారు. అదొక్కటే కాదు.. ఓవైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు తదుపరి భారీ షెడ్యూల్ కోసం కోలార్ పరిసరాల్లో భారీ సెట్స్ ని నిర్మిస్తున్నారు. ఈ సెట్స్ లో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ సహా కీలక సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారు. ఒకేసారి మూడు చోట్ల మూడు భారీ సెట్స్ ని నిర్మిస్తున్నారట. వీటి కోసం ఏకంగా 350మంది సెట్ వర్కర్లు పని చేస్తున్నారని తెలుస్తోంది. ఇంతమంది సెట్స్ కోసం పని చేస్తున్నారంటేనే సెట్స్ కి ప్రాధాన్యత ఎంతో అర్థమవుతోంది. కేజీఎఫ్ 1 కోసం పని చేసిన కళాదర్శకుడు శివకుమార్ సీక్వెల్ కి సెట్స్ ని డిజైన్ చేస్తున్నారు. ఆయన సారథ్యంలోనే సెట్స్ నిర్మాణం జరుగుతోంది. పార్ట్ 1 కంటే ఎంతో పెద్ద స్కేల్ లో బడ్జెట్లు ఖర్చు చేస్తుండడంతో సీక్వెల్ వీరలెవల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఇంత పెద్ద స్థాయిలో వర్క్ చేస్తున్నారు కాబట్టి సీక్వెల్ ఏ రేంజుంలో ఉంటుందో చూడాలన్న ఆత్రం పెరుగుతోంది ఫ్యాన్స్ లో. కేజీఎఫ్ కథ.. హీరో నటనతో పాటు సెట్స్ డిజైనింగ్ కి పేరొచ్చింది. అందుకే పార్ట్ 2లో సెట్స్ ఏ రేంజులో ఉండబోతున్నాయో అన్న చర్చ సాగుతోంది. కేజీఎఫ్ చాప్టర్ 2 వచ్చే ఏడాది విడుదల కానుంది. సీక్వెల్ పనితనం ఎంతో తెలియాలంటే అంతవరకూ వేచి చూడాల్సిందే. హోంబలే ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.