కొందరిని చూస్తే పెట్టబుద్దౌతుంది కొందరిని చూస్తే తిట్టబుద్దౌతుంది.. అని సహజంగా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. మరి కాజల్ ని చూస్తే ఏమౌతుంది.. పా రంజిత్ ని చూస్తే ఎమౌతుంది? కాజల్ ని చూస్తే ముద్దెట్టుకోబుద్దౌతుంది(డౌట్ ఉంటే ఛోటా సారుని అడగండి)... మరి పా రంజిత్ ని చూస్తే ఓ క్రేజీ ఆఫర్ ఇవ్వబుద్ధౌతుంది! దీనికి మళ్ళీ ఛోటా సార్ అడక్కండి. ఆయనకు సెంటీమీటర్ కూడా సంబంధం లేదు.. ఆఫర్ కూడా ఆయనేమీ ఇవ్వలేదు.
పా మొదట్లో చేసిన సినిమాలను పక్కనబెడితే 'కబాలి'.. 'కాలా' లాంటి కడు ఘనమైన సినిమాలను ప్రేక్షకుల మీదకు వదిలిన దర్శకుడు అయన. సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు మింగలేక కక్కలేక.. ఆ సినిమాలను వెనకేసుకు రాలేక చచ్చారు. 'కాలా' రిలీజ్ అయిన కొత్తలో పా కు రజనీ ముచ్చటగా మూడో ఆఫర్ ఇస్తాడని వార్తలు వచ్చాయి. దెబ్బకు రజనీ అభిమానులకు మాటలు పెగల్లేదు. సరే రజనీ అదేదో సినిమాలో చెప్పినట్టు 'గతం గతః'. వర్తమానానికి వస్తే కూడా పా రంజిత్ కి లక్కు లక్కలా అంటుకునే ఉంది. ఈసారి ఏకంగా ఓ బాలీవుడ్ కార్పోరేట్ హౌస్ నుండి ఒక క్రేజీ ప్రాజెక్టుకి దర్శకత్వం వహించే ఆఫర్ వచ్చిందట. ఈ సినిమా ట్రైబల్ ఫ్రీడం ఫైటర్ బిర్సా ముండా జీవితం ఆధారం గా తెరకెక్కుతుందని సమాచారం.
ఇప్పటి ఝార్కండ్ ప్రాంతానికి చెందిన బిర్సా ముండా బ్రిటీష్ వారిపై పోరాడిన యోధుడు. అయన ఉద్యమ ప్రభావం అప్పట్లో బీహార్ మాత్రమే కాకుండా.. ఒరిస్సా.. వెస్ట్ బెంగాల్.. మధ్య ప్రదేశ్ ప్రాంతాలపై కూడా ఉందంటే ఎలాంటి గొప్ప యోధుడో మనం అర్థం చేసుకోవచ్చు. ఇరవై ఐదేళ్ళ ప్రాయంలోనే జైల్లో అయన మరణించారు. బ్రిటీష్ వారు అయన అనారోగ్యం వల్లే చనిపోయారని అన్నారు గానీ.. అయన మరణంపై భిన్నాభిప్రాయా లు ఉన్నాయి. ఇప్పుడు అర్థం అయింది కథా ఇదెంత పవర్ఫుల్ స్టోరీ నో.. పా ఎంత జాక్ పాట్ ఆఫర్ కొట్టాడో!