రిలీజైన 20రోజుల్లో ఓటీటీలోకి `పాగ‌ల్`

Update: 2021-08-31 14:39 GMT
ఏదైనా సినిమాని థియేట‌ర్ల‌లో విడుద‌లైన రెండు నెల‌ల త‌ర్వాత‌ ఓటీటీలో రిలీజ్ చేయాల‌న్న నియ‌మం ఉంది. కానీ దానిని కోవిడ్ క్రైసిస్ కార‌ణంగా నిర్మాత‌లు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేదు. ఓటీటీల‌తో రూల్ బ్రేక్ చేసి ఒప్పందాలు చేసుకోవ‌డంతో అది ప‌రిశ్ర‌మ‌లో ఇటీవ‌ల చ‌ర్చ‌కు వ‌చ్చింది. థియేట‌ర్ల‌లోకి విడుద‌లైన త‌ర్వాత‌ కేవ‌లం 20 రోజుల్లోనే చాలా సినిమాలు ఓటీటీల్లోకి వ‌చ్చేస్తున్నాయి. దీనిపై డిస్ట్రిబ్యూట‌ర్ల‌లో ఆందోళ‌న నెల‌కొంది.

ఇటీవ‌ల వైల్డ్ డాగ్.. జాతిర‌త్నాలు .. ఉప్పెన.. వ‌కీల్ సాబ్ వంటి చిత్రాలు ఓటీటీల్లో విశేష ఆద‌ర‌ణను ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిందే. ఇవ‌న్నీ త‌క్కువ స‌మ‌యంలోనే ఓటీటీల్లోకి వచ్చేశాయి. విశ్వక్ సేన్ తాజా చిత్రం పాగల్ ఇప్పుడు OTT విడుదలకు సిద్ధమవుతోంది.  అమెజాన్ ప్రైమ్ వీడియో యూత్ ఫుల్ లవ్ డ్రామా పాగ‌ల్ OTT హక్కులను చేజిక్కించుకుంది. సెప్టెంబర్ 3 నుంచి పాగల్ అందుబాటులోకి వస్తుందని తాజా సమాచారం. అమెజాన్ ప్రైమ్ ద్వారా త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.

పాగల్ లో విశ్వక్ సేన్ - నివేదా పేతురాజ్ జంట‌గా న‌టించారు. ఈ చిత్రానికి నరేశ్ కుప్పిలి దర్శకత్వం వహించారు. ఆగస్టు 14 న థియేటర్లలో విడుదలైంది.
Tags:    

Similar News